గంగ‌నీటితో క‌రోనా క‌ట్ట‌డి ! క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కి ప్ర‌తిపాద‌న‌

గంగానది నీటితో కరోనా వైరస్‌పై క్లినికల్ ట్రయల్స్ జరపాల‌ని............

గంగ‌నీటితో క‌రోనా క‌ట్ట‌డి ! క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కి ప్ర‌తిపాద‌న‌
Follow us

|

Updated on: May 04, 2020 | 1:23 PM

మ‌న దేశంలో ప్ర‌వ‌హించే ప‌విత్ర గంగాన‌ది గురించి తెలియ‌రువారుండ‌రు. గంగ ప‌విత్ర‌త గురించి కూడా అనేక క‌థ‌లు మ‌నం వింటుంటాం. కరోనా లాక్‌డౌన్ కారణంగా గంగానదిలో కాలుష్యం చాలా తగ్గింది. ఇప్పుడు గంగానదిలో చాలా ప్రదేశాల్లో నీటిని డైరెక్టుగా తాగొచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ (CPCB) తెలిపింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి గంగాన‌ది నీటితో ప‌రిష్కారం దొరుతుంద‌నే ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తున్నాయి.

భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)కి ఓ ప్రతిపాదన వచ్చింది. దాని సారాంశం మేర‌కు గంగానది నీటితో  కరోనా వైరస్‌పై క్లినికల్ ట్రయల్స్ జరపాల‌ని అందులో పేర్కొన్నారు. గంగానదికి ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల కరోనా వైరస్‌ను చంపగలదన్నది ఆ ప్రతిపాదన చేసిన వారి ఉద్దేశం. జలశక్తి మంత్రిత్వ శాఖలోని గంగా శుద్ధి జాతీయ మిషన్ (NMCG) ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్మీలో రిటైర్ అయిన వారు ఏర్పాటు చేసుకున్న అత్యుల్య గంగ అనే సంస్థ ఈ రిక్వెస్ట్ చేయడంతో… NMCG కూడా ప్రతిపాదన తెచ్చింది. ఏదో ఊహాకల్పితంగా ఈ ప్రతిపాదన తీసుకురాలేద‌ట‌. ఇందుకు బలమైన కారణం కూడా ఉంద‌ని చెప్పారు.

నింజా  వైరస్ అనేది… గంగా నది నీటి పైన జీవిస్తోంది. దీన్నే మన దేశంలో గంగత్వ. నిజానికి ఇది వైరస్ కాదు… ఒకరకమైన బ్యాక్టీరియా. కరోనా లాంటి వాటిని తరిమికొట్టేలా వీటిలో శక్తిమంతమైన స్ట్రెయిన్ ఉంది. ఈ బ్యాక్టీరియా మనుషుల శరీరంలో సూక్ష్మక్రిముల నిరోధక వ్యవస్థలా పనిచేయగలదని అతుల్య గంగా వ్యవస్థాపకుడు మేజర్ మనోజ్ కేశ్వర్ (రిటైర్డ్) చెబుతున్నారు. దేశ ప్రజలకు గంగానది పవిత్రమైనదన్న ఆయన… లక్కీగా నింజా వైరస్… కరోనా వైరస్‌ని చంపుతుందేమో పరిశీలిస్తే మంచిదే  అని సూచించారు.