తెలంగాణ మంత్రులకు అరుణ వార్నింగ్
తెలంగాణ మంత్రులకు భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా ప్రభావం ధాన్యం సేకరణ వంటి విషయాల్లో లోపాలను ప్రభుత్వానికి తెలియజేస్తున్న బిజెపి నేతలపై ఎదురు దాడికి దిగితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.
తెలంగాణ మంత్రులకు భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా ప్రభావం ధాన్యం సేకరణ వంటి విషయాల్లో లోపాలను ప్రభుత్వానికి తెలియజేస్తున్న బిజెపి నేతలపై ఎదురు దాడికి దిగితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. బిజెపి గనక రాజకీయం చేయదలుచుకుంటే టీఆర్ఎస్ మంత్రులు ఒక్కరు కూడా బయట తిరగలేని అరుణ వ్యాఖ్యానించారు.
సోమవారం బిజెపి నేత డీకే అరుణ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ధాన్యం సేకరణలో ఇబ్బందులను ఆమె ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మీడియాకు వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతున్నాయని.. అయినా కూడా టిఆర్ఎస్ నేతలు బిజెపిపై రాజకీయ విమర్శలకు దిగుతున్నారని.. ఇది సరికాదని అరుణ వ్యాఖ్యానించారు ముందు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆమె హితవు పలికారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. రైతులంతా బిజెపి నేతలను సంప్రదిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని వివరించారు.
రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అరుణ తెలిపారు. సమస్యలను లేవనెత్తి, లోటుపాట్లను ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తే బిజెపి నేతలపై టీఆర్ఎస్ మంత్రులు మాటల దాడికి దిగుతున్నారని, ఇది సరికాదని అరుణ అన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు లెక్కలను మంత్రులు చెప్పగలరా? అంటూ ఆమె సవాల్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన సబ్‌స్టేషన్లు, కొత్త విద్యుత్ లైన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు వివరించడం లేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ మాదిరిగా బిజెపి కూడా రాజకీయం చేయదలుచుకుంటే రాష్ట్ర మంత్రులు ఎవరు బయట తిరగలేరని అరుణ హెచ్చరించారు.