5

విషాదం.. వలస కార్మికులు వెళ్తున్న బస్సుకు ప్రమాదం..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారు స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని.. వారి వారి స్వస్థలాలకు పంపుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో ఒడిషాలో విషాదం చోటుచేసుకుంది. వలస కార్మికులను తీసుకువెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కాంధమల్ జిల్లాలో […]

విషాదం.. వలస కార్మికులు వెళ్తున్న బస్సుకు ప్రమాదం..
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 6:48 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారు స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని.. వారి వారి స్వస్థలాలకు పంపుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో ఒడిషాలో విషాదం చోటుచేసుకుంది. వలస కార్మికులను తీసుకువెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కాంధమల్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో చిక్కుకుపోయిన కార్మికులు.. ఒడిశాలోని తమ స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సుల్లో వస్తుండగా కళింగ ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గుజరాత్‌ నుంచి నాలుగు బస్సుల్లో వస్తుండగా.. ఓ బస్సుకి ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇదే ప్రాంతలో ఆదివారం ఉదయం కూడా మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలోఐదుగురు గాయపడ్డారు.