వైరస్ వ్యాప్తి తగ్గినా.. నిలకడ లేని కేసులు.. నీతి ఆయోగ్ సభ్యుడు వీ.కె.పాల్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని, అయితే కేసుల సంఖ్య నిలకడగా లేదని అన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీ,కె. పాల్. లాక్ డౌన్ కి ముందు కరోనా  కేసుల సంఖ్యను, ఇప్పటి సంఖ్యను పోల్చి చూస్తే.. తొలుత కేవలం అయిదు రోజుల్లో ఇవి రెట్టింపు కాగా..

వైరస్ వ్యాప్తి తగ్గినా.. నిలకడ లేని కేసులు.. నీతి ఆయోగ్ సభ్యుడు వీ.కె.పాల్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 03, 2020 | 6:48 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని, అయితే కేసుల సంఖ్య నిలకడగా లేదని అన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీ,కె. పాల్. లాక్ డౌన్ కి ముందు కరోనా  కేసుల సంఖ్యను, ఇప్పటి సంఖ్యను పోల్చి చూస్తే.. తొలుత కేవలం అయిదు రోజుల్లో ఇవి రెట్టింపు కాగా.. ప్రస్తుతం సుమారు పది, పన్నెండు రోజులు పడుతోందని ఆయన చెప్పారు. ఏమైనా కేసుల సంఖ్య త్వరలో నిలకడ దశకు రావచ్ఛునని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు. వైరస్ వ్యాప్తికి చెక్ చెప్పడమే లాక్ డౌన్ ఉద్దేశమని, మధ్యలో లాక్ డౌన్ ఎత్తివేస్తే దీని లక్ష్యం నీరుగారుతుందని పాల్ పేర్కొన్నారు.

కరోనా అదుపునకు ఉద్దేశించిన మెడికల్ ఈక్విప్ మెంట్ అండ్ మేనేజ్ మెంట్ ప్లాన్ కు సంబంధించిన అధీకృత బృందానికి ఈయన చైర్మన్గ్ గా వ్యవహరిస్తున్నారు.