AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swathimuthyam: ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు కలిపితే స్వాతి ముత్యం.. ఆకట్టుకుంటున్న సాంగ్

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్ బాబు. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

Swathimuthyam: ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు కలిపితే స్వాతి ముత్యం.. ఆకట్టుకుంటున్న సాంగ్
Swathimuthyam
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2022 | 9:38 AM

Share

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్(Ganesh Bellamkonda). ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. బెల్లం కొండ గణేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం. అందమైన ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయికి , ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు … ఇవన్నీ స్వాతిముత్యం సినిమాలో చూపించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘స్వాతిముత్యం’ సినిమాలో వర్ష బొల్లమ్మ కధానాయికగా నటిస్తోంది. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రేమ గీతం తాజాగా విడుదల అయింది. వర్ష బొల్లమ్మతో “నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా…నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా” అంటూ పాటందుకున్నాడు గణేష్. ఈ గీతానికి సాహిత్యాన్ని కె కె అందించగా, అర్మాన్ మాలిక్, సంజన కాలమంజే శ్రావ్యంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతంలో కొత్త హొయలు పోయిందీ గీతం. గణేష్ మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. పాట విడుదలైన క్షణం నుంచే అది ఆకట్టుకుంటున్న వైనం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు చిత్ర దర్శకుడు లక్ష్మణ్. ప్రతి పాట కు ప్రసవ వేదన ఉంటుంది. ఈ పాట కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ పాట కొన్ని పర్యాయాలు రాసిన తరువాతే అందరికీ ఆమోదయోగ్యమయింది. దర్శకుడు చెప్పిన సందర్భానికి, సంగీత దర్శకుని బాణీలకు, నిర్మాత అభిరుచికి తగినట్లుగా సాహిత్యం అందించటం ఆనందంగా ఉంది. అలాగే ఈ పాటలో పల్లవి నాకెంతో ఇష్టం అన్నారు రచయిత కె కె.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారం ఊపందుకుంటోంది. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోంది’స్వాతిముత్యం’. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ రానుంది. ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో గ్లిమ్ప్స్  ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, ప్రగతి, సురేఖావాణి, సునయన నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..