పునాదులు తవ్వుతుండగా భారీ శబ్ధం.. లోపల చూస్తే కళ్లు జిగేల్ !!
నిర్మాణ పనుల్లో కూలీలు నిమగ్నమైపోయారు. తమపని తాము చేసుకుపోతున్నారు. అలా పునాదులు తవ్వుతుండగా ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. ఏంటా అని చూస్తే అదొక మట్టి కుండ.
నిర్మాణ పనుల్లో కూలీలు నిమగ్నమైపోయారు. తమపని తాము చేసుకుపోతున్నారు. అలా పునాదులు తవ్వుతుండగా ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. ఏంటా అని చూస్తే అదొక మట్టి కుండ. దాని చుట్టూ ఉన్న మట్టిని తీసి.. ఆ కుండను బయటికి తీశారు. అందులో ఏముందా అని తెరిచి చూడగా వారి కళ్లు జిగేలుమన్నాయి. పంజాబ్‌లోని రాయకోట్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లమ్మే జట్టాపురా గ్రామంలో ఉన్న చారిత్రక గురుద్వార్ పునర్నిర్మాణంలో భాగంగా కూలీలు పునాది తవ్వుతుండగా ఓ పురాతన మట్టి కుండ బయటపడింది. ఇక దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అందులో వారికి 100కు పైగా బ్రిటీష్ కాలం నాటి పాత నాణేలు దొరికాయి. వాటిపై లోతైన అధ్యయనం చేయాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులను గురుద్వార్ నిర్వాహకులు కోరారు. కాగా వాటిలో ఒకటి బంగారు నాణెం కూడా ఉంది.. మిగిలినవి వెండి నాణేలు. అవి ఏ కాలం నాటివో తెలుసుకునేందుకు వాటిపై అధ్యయనం చేయాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులను కోరుతున్నట్లు” శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యుడు గురుచరణ్ సింగ్ గ్రేవల్ వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్న చిలుక !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

