సైనికుల సహాయనిధికి ఆలయ ట్రస్ట్ భారీ విరాళం
ముంబయి: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు తోచిన సహాయాన్ని సైనికుల సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ శ్రీసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ సైనికుల సహాయ నిధికి భారీ విరాళం ప్రకటించింది. రూ.51లక్షల రూపాయలను వినాయక ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు విరాళంగా ఇవ్వనున్నారు. కాగా సైనికుల సహాయ నిధికి సాయం చేసేందుకు టాలీవుడ్ నుంచి మొదటగా విజయ్ దేవరకొండ ముందుకు వచ్చాడు. […]
ముంబయి: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు తోచిన సహాయాన్ని సైనికుల సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ శ్రీసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ సైనికుల సహాయ నిధికి భారీ విరాళం ప్రకటించింది. రూ.51లక్షల రూపాయలను వినాయక ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు విరాళంగా ఇవ్వనున్నారు. కాగా సైనికుల సహాయ నిధికి సాయం చేసేందుకు టాలీవుడ్ నుంచి మొదటగా విజయ్ దేవరకొండ ముందుకు వచ్చాడు. తన తరపున కొంత డబ్బును విరాళంగా ఇచ్చి.. అందరూ ఎంతోకొంత సాయం చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.