AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కపిల్ శర్మ షో నుంచి సిద్ధూకి గుడ్ బై

దిల్లీ : హాస్యనటుడు కపిల్‌శర్మ నిర్వహించే టీవీ షో ‘ది కపిల్‌ శర్మ షో’ నుంచి మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూను తప్పించారు. పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై ఆయన చేసిన సానుభూతి వ్యాఖ్యలు ఈ చర్యలకు కారణమని తెలుస్తోంది. ఆయన స్థానంలో అర్చన పురాణ్‌ సింగ్‌ను షోలోకి తీసుకొన్నారు. సిద్ధూ వ్యాఖ్యల నేపథ్యంలో టీవీషో కూడా అనవసర వివాదంలో చిక్కుకుంటుందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. పుల్వామా దాడిపై నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. జమ్ము, […]

కపిల్ శర్మ షో నుంచి సిద్ధూకి గుడ్ బై
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:59 PM

Share

దిల్లీ : హాస్యనటుడు కపిల్‌శర్మ నిర్వహించే టీవీ షో ‘ది కపిల్‌ శర్మ షో’ నుంచి మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూను తప్పించారు. పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై ఆయన చేసిన సానుభూతి వ్యాఖ్యలు ఈ చర్యలకు కారణమని తెలుస్తోంది. ఆయన స్థానంలో అర్చన పురాణ్‌ సింగ్‌ను షోలోకి తీసుకొన్నారు. సిద్ధూ వ్యాఖ్యల నేపథ్యంలో టీవీషో కూడా అనవసర వివాదంలో చిక్కుకుంటుందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

పుల్వామా దాడిపై నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. జమ్ము, కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదొక పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగినా వ్యతిరేకించాలని, దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇదే సందర్భంలో కొంతమంది చేసిన తప్పునకు దేశం మొత్తాన్ని నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సిద్ధూపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అందులో కొందరు కపిల్‌ శర్మ షో నుంచి సిద్ధూను తొలగించాలనే డిమాండ్‌ను లేవనెత్తారు. దీంతో షో యాజమాన్యం తాజా నిర్ణయం తీసుకొన్నట్లు భావిస్తున్నారు.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..