డ్రైవర్ నిర్లక్ష్య౦తో ఆర్టీసీ బస్సు బోల్తా
ప్రకాశం జిల్లా కందుకూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సూపర్ లగ్జరీ బస్సు, నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున పొలాల్లోకి దూసుకెళ్ళి పల్టీ కొట్టింది. రోడ్డు మీది నుంచి సుమారు రెండు మీటర్ల దిగువకు ఉన్న పొలాల్లోకి దూసుకుపోవడ౦తో బస్సు తిరగబడింది. దీ౦తో ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయి.. తొక్కిసలాట చోటుచేసుకుంది. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. 19మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడ౦తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.