భూమిని మరిస్తే ఎలా..? పొలం దున్నిన తెలంగాణ మంత్రి

తెలంగాణలో పొలిటిషన్స్ ఇప్పుడు యమ బిజీ. ఎందుకంటే మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ మంత్రులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్‌పై దిశానిర్దేశం చేశారు. అయితే ఓ తెలంగాణ మంత్రి మాత్రం ఈ ఆదివారం చాలా రిలాక్సిడ్ కనిపించారు. తన సొంత పొలానికి వెళ్లి ట్రాక్టరుతో పొలం దున్నారు. ఇంతకీ ఆ అమాత్యుడు ఎవరు అనుకుంటున్నారా.. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా […]

భూమిని మరిస్తే ఎలా..? పొలం దున్నిన తెలంగాణ మంత్రి

తెలంగాణలో పొలిటిషన్స్ ఇప్పుడు యమ బిజీ. ఎందుకంటే మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ మంత్రులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్‌పై దిశానిర్దేశం చేశారు. అయితే ఓ తెలంగాణ మంత్రి మాత్రం ఈ ఆదివారం చాలా రిలాక్సిడ్ కనిపించారు. తన సొంత పొలానికి వెళ్లి ట్రాక్టరుతో పొలం దున్నారు. ఇంతకీ ఆ అమాత్యుడు ఎవరు అనుకుంటున్నారా.. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా పర్వగిరిలో ఉన్న పొలంలో కాసేపు స్వేదం చిందించారు ఎర్రబెల్లి. ఎంత స్థాయికి వెళ్లినా అన్నం పెట్టిన భూమిని మర్చిపోకూడదన్న ఆయన… ఆ తర్వాత అదే గ్రామంలో కాసేపు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పారిశుద్ద్యం, డ్రైనేజ్ పనుల గురించి ఆరా తీశారు.

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu