ఈ నెల 26న మైండ్‌ట్రీ బోర్డు సమావేశం

ముంబయి: మైండ్‌ ట్రీని దక్కించుకోవడానికి ఎల్ అండ్ టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాన్ని పసిగట్టిన మైండ్‌ట్రీ బోర్డు  మార్చి 26వ తేదీన మరోసారి సమావేశం  కానుంది. ఇప్పటికే ఎల్‌అండ్‌టీ బోర్డు…మైండ్‌ ట్రీ యొక్క 20.32శాతం వాటాను కొనుగోలు చేసింది. మరోపక్క కంపెనేని పూర్తిగా టేకోవర్‌ చేసుకోడానికి పకడ్భందీ వ్యూహాలు రచిస్తుంది.  66 శాతం వరకు వాటా కోసం రూ.10,800 కోట్లను ఆఫర్‌ చేసింది. ఇప్పటికే ఫోర్స్‌డ్  టేకోవర్‌ బిడ్‌ను ప్రకటించింది. ముందుగా కాఫీ డే […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:45 pm, Fri, 22 March 19
ఈ నెల 26న మైండ్‌ట్రీ బోర్డు సమావేశం

ముంబయి: మైండ్‌ ట్రీని దక్కించుకోవడానికి ఎల్ అండ్ టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాన్ని పసిగట్టిన మైండ్‌ట్రీ బోర్డు  మార్చి 26వ తేదీన మరోసారి సమావేశం  కానుంది. ఇప్పటికే ఎల్‌అండ్‌టీ బోర్డు…మైండ్‌ ట్రీ యొక్క 20.32శాతం వాటాను కొనుగోలు చేసింది. మరోపక్క కంపెనేని పూర్తిగా టేకోవర్‌ చేసుకోడానికి పకడ్భందీ వ్యూహాలు రచిస్తుంది.  66 శాతం వరకు వాటా కోసం రూ.10,800 కోట్లను ఆఫర్‌ చేసింది. ఇప్పటికే ఫోర్స్‌డ్  టేకోవర్‌ బిడ్‌ను ప్రకటించింది. ముందుగా కాఫీ డే యజమాని వి.జి. సిద్ధార్థ నుంచి 20.32 శాతం వాటాను కొనుగోలు చేయడం కోసం అగ్రిమెంట్ చేసుకుంది. అదే సమయంలో బయట మార్కెట్ నుంచి మరో 15 శాతాన్ని సొంతం చేసుకోవడానికి బ్రోకర్ల ద్వారా అడుగులు వేస్తుంది. ఇక వేచి చూసే దోరణిని అవలంభిస్తే లాభంలేదనుకున్న  మైండ్‌ట్రీ  ప్రత్యామ్నాయ మార్గాలపై ద‌ృష్టి పెట్టింద. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లకు బైబ్యాక్‌ లేదా ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాలా అనే అంశాలపై చర్చించనుంది. ఇప్పటికే బైబ్యాక్‌ ఆఫర్‌పై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ రూ.10,800 కోట్ల బలవంతపు బిడ్‌ను ఎదుర్కొనే అంశంపై చర్చించనుంది. ఈ విషయాన్ని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.