AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజ్ కోసం కేజ్రీవాల్ చెంప పగలగొట్టా..!

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టారా..? ఇతనెవరో కాదండీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెంపను పగలగొట్టిన వ్యక్తే . ఇతని పేరు సురేష్. ఢిల్లీ నివాసి. ఆ సంఘటన జరిగిన ఆరు రోజులకు తెర మీదకు వచ్చి కులాసాగా సారీ చెబుతున్నాడు. ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని.. అసలు ఎందుకు కొట్టానో తనకు తెలియదని అంటున్నాడు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తను కాదని, సాధారణ ఓటర్‌నని సురేష్ స్పష్టం చేశాడు. […]

క్రేజ్ కోసం కేజ్రీవాల్ చెంప పగలగొట్టా..!
Ravi Kiran
|

Updated on: May 10, 2019 | 8:35 AM

Share

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టారా..? ఇతనెవరో కాదండీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెంపను పగలగొట్టిన వ్యక్తే . ఇతని పేరు సురేష్. ఢిల్లీ నివాసి. ఆ సంఘటన జరిగిన ఆరు రోజులకు తెర మీదకు వచ్చి కులాసాగా సారీ చెబుతున్నాడు.

ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని.. అసలు ఎందుకు కొట్టానో తనకు తెలియదని అంటున్నాడు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తను కాదని, సాధారణ ఓటర్‌నని సురేష్ స్పష్టం చేశాడు. ఎలాంటి రాజకీయ కారణాలు, కుట్ర పన్ని తాను ముఖ్యమంత్రిని చెంప దెబ్బ కొట్టలేదని వివరణ ఇచ్చాడు.

మరోవైపు ఈ నెల 4వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని మోతీనగర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌ను ఆయన ప్రయాణిస్తున్న వాహనం పైకి ఎక్కి మరీ సురేష్ చెంప పగల గొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సురేష్‌‌ని ఆప్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజకీయ రంగును కూడా పులుముకొంది. దీని వెనుక బీజేపీ హస్తం ఉందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. తాము ఓడిపోతున్నామనే అక్కసుతోనే ఇలా దాడి చేయించారని ఆరోపించారు.