AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.. 3 మార్గాల్లో దర్శనానికి అనుమతి!

వైకుంఠ ద్వార దర్శనం, కొత్త సవంత్సరం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల భారీగా తరివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే వైకుంఠద్వార దర్శనాల తొలి మూడు రోజుల్లో మూడు ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులకు అనుమతించాలని టీటీడీ భావిస్తోంది.

TTD: వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.. 3 మార్గాల్లో దర్శనానికి అనుమతి!
Ttd
Anand T
|

Updated on: Dec 22, 2025 | 9:09 PM

Share

తిరుమల శ్రీవారి వైకుంట ద్వారా దర్శనానికి సమయం ఆసన్నమైంది.డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు జరుగనున్నాయి. దీంతో శ్రీవారికి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తోపులాటలు, గందరగోళ పరిస్థితులు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైకుంఠద్వార దర్శనాల తొలి మూడు రోజుల్లో మూడు ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకు గాను 30వ తేదీ (ఏకాదశి), 31వ తేదీ (ద్వాదశి), జనవరి 1వ తేదీకి సంబంధించి మొత్తం 1.76 లక్షల మంది భక్తులకు ఈ-డిప్ విధానంలో ముందస్తుగా స్లాటెడ్ సర్వ దర్శన టోకెట్లను కేటాయించింది.

అయితే వైకుంఠ ద్వారా దర్శన మొదటి రోజున 5 గంటల వీఐపీ బ్రేక్ దర్శనాల మినహా మిగతా టైం మొత్తం స్లాటెడ్‌ దర్శన టోకెన్లు కలిగిన భక్తుల దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రోజుకు 60,000 మందికి పైగా భక్తులకు, మొత్తం 14 స్లాట్లలో టోకెన్లు జారీ చేయగా, వీరికి ప్రవేశ మార్గాలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం స్లాట్ల భక్తులు కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ల భక్తులు ఏటీజీహెచ్ నుంచి, రాత్రి స్లాట్ల భక్తులు శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.ఇక వైకుంటద్వారా దర్శనాల నేపథ్యలో మూడు రోజుల పాటు టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది.

భక్తులకు జిల్లా ఎస్పీ సూచనలు

  • టీటీడీ కేటాయించిన స్లాట్ సమయానికి మాత్రమే భక్తులు ప్రవేశ మార్గాలకు చేరుకోవాలి
  • టోకెన్, ఆధార్/గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
  • సూచించిన ప్రవేశ మార్గాలనే అనుసరించాలి, మార్గం మార్పు చేయరాదు.
  • పోలీస్, టీటీడీ సిబ్బంది ఇచ్చే ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
  • గుంపులు గుంపులుగా చేరకుండా శాంతి భద్రతలకు సహకరించాలి.
  • అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.