Injured Cockroach: గాయపడిన బొద్దింకను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన ఓ వ్యక్తి.. డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసిన డాక్టర్

Injured Cockroach: మనిషికే కాదు.. ప్రతి జీవికి దెబ్బతగిలితే బాధ ఉంటుంది. పెంపుడు జంతువులైన ఆవు, కుక్క వంటి వాటికే కాదు.. సింహం, పాము, వంటి జంతువులకు గాయాలు..

Injured Cockroach:  గాయపడిన బొద్దింకను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన ఓ వ్యక్తి.. డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసిన డాక్టర్
Injured Cockroach
Follow us

|

Updated on: Jun 04, 2021 | 4:53 PM

Injured Cockroach: మనిషికే కాదు.. ప్రతి జీవికి దెబ్బతగిలితే బాధ ఉంటుంది. పెంపుడు జంతువులైన ఆవు, కుక్క వంటి వాటికే కాదు.. సింహం, పాము, వంటి జంతువులకు గాయాలు ఐతే.. వైద్యం నిమిత్తం డాక్టర్స్ వద్దకు తీసుకువెళ్లిన వార్తలు విన్నాం.. అయితే తాజాగా ఓ వ్యక్తి.. గాయపడి రోడ్డుమీద పడి ఉన్న బొద్దింకను డాక్టర్ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్ళాడు.. ఈ ఘటన థాయ్ లాండ్ లో చోటు చేసుకుంది.

థాయ్‌లాండ్‌లోని క్రతుం బేన్‌కు చెందిన పశువైద్యుడు ఆస్పత్రిలో గత వారం నుంచి ఓ అసాధారణ రోగికి చికిత్సనందిస్తున్నాడు. వారం రోజుల క్రితం ఒక వ్యక్తి గాయపడిన బొద్దింకతో పశువైద్యుడి వద్దకు వచ్చాడు. తాను రోడ్డుమీద వెళ్తున్న సమయంలో గాయంతో పడి ఉన్న బొద్దింకను చూశానని.. దాని గాయం చూసి ఉండలేక పోయిన తను వెంటనే ఆస్పత్రికి తరలించామని చెప్పాడు.

వెంటనే పశువైద్య ఆస్పత్రికి చికిత్సనిమిత్తం బొద్దింకను తీసుకుని వెళ్లి.. వైద్యం అందించాడు. ఈ విషయాని డాక్టర్ తన ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బొద్దింకలను ఆహారంగా తీసుకునే థాయ్ లాండ్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం కొందరికి షాక్ నిస్తే.. మరికొందరు జోక్ గా తీసుకుంటున్నారు/ అయితే ఇది జోక్ కాదని.. ఓ జీవి పడుతున్న కష్టం చూసి.. జాలి దయ ఉన్న మనిషి అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి జీవి ప్రాణం విలువైనదని.. ఇటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కువ మంది ఉండాలని తాను కోరుకుంటున్నట్లు డాక్టర్ చెప్పారు. అంతేకాదు ఆ బొద్దింక గాయానికి చికిత్స చేసినందుకు డబ్బులు తీసుకోలేని చెప్పారు డాక్టర్ వానిచ్.

అయితే ఇలా అనారోగ్యంతో ఉన్న బొద్దింకకు చికిత్స నందించడం ఇదే మొదటి సారి కాదు.. 2019 లో, రష్యాలో కూడా చోటు చేసుకుంది.  గర్భిణీ స్త్రీ అనారోగ్యంతో ఉన్న బొద్దింకను పుఖ్ దానియా నైలీవ్నా పశువైద్యుల ఆస్పత్రికి తరలించారు. అప్పుడు పశువైద్యులు బొద్దింక ప్రాణాలను కాపాడడం కోసం అత్యవసర నానో-సర్జరీ చేశారు.

Also Read: పది నిమిషాల్లో రెడీ చేసుకునే టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..