AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sputnik-V Vaccine: స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ ఉత్పత్తికి సై.. డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న సీరం సంస్థ..

రష్యా రూపొందించిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను తాము కూడా తయారు చేస్తామని, అందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌...

Sputnik-V Vaccine: స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ ఉత్పత్తికి సై.. డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న సీరం సంస్థ..
Sputnik V
Ravi Kiran
|

Updated on: Jun 04, 2021 | 8:47 PM

Share

రష్యా రూపొందించిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను తాము కూడా తయారు చేస్తామని, అందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే భార‌త్‌లో స్పుత్నిక్-వీ వినియోగానికి డీసీజీఐ అనుమ‌తులు ఇవ్వగా.. ర‌ష్యా నుంచి దాదాపు 30 ల‌క్ష‌ల డోసులు భార‌త్‌కు చేరుకున్నాయి. వీటిని హైద‌రాబాద్‌లోని రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వ‌ర్యంలో పంపిణీ చేస్తున్నారు. కాగా, ఇప్పుడు స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్ ప్ర‌భావశీల‌త గురించి విశ్లేష‌ణ, ప‌రీక్ష‌లు చేయ‌డానికి కూడా అనుమ‌తులు ఇవ్వాలని సీరం సంస్థ డీసీజీఐని కోరినట్లు స‌మాచారం.

ఫైజర్‌, మోడెర్నా తరహాలోనే తమకు కూడా నష్టపరిహార నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని సీరం కోరుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్వదేశీ అయినా, విదేశీ అయినా టీకా తయారీదారులందరికీ ఒకే రకమైన భద్రత ఉండాలని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, ఇప్ప‌టికే భార‌త్‌లో సీరం ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా కొవిషీల్డ్‌ను ఉత్ప‌త్తి చేస్తోంది. ఈ నెల‌లో 10 కోట్ల డోసులు ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి తెలిపింది. అంతేగాక‌, అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని కూడా ప్రారంభించింది. దీనికి అమెరికా నుంచి మ‌రికొన్ని అనుమ‌తులు రావాల్సి ఉంది.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!