Coriander Rice Recipe: పది నిమిషాల్లో రెడీ చేసుకునే టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!
Coriander Rice Recipe: రోజు రెగ్యులర్ కూరలు .. వంటలేనా అంటూ ఇంట్లో పిల్లలే కాదు పెద్దలు కూడా అంటారు. ఒకొక్కసారి పిల్లలు అన్నం తినడానికి పేచీ పెడతారు...
Coriander Rice Recipe: రోజు రెగ్యులర్ కూరలు .. వంటలేనా అంటూ ఇంట్లో పిల్లలే కాదు పెద్దలు కూడా అంటారు. ఒకొక్కసారి పిల్లలు అన్నం తినడానికి పేచీ పెడతారు. అటువంటి సమయంలో ఈజీగా టేస్టీగా కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచి రుచి గా ఉండే కొత్తిమీద రైస్ తయారీ విధానం ఈరోజు తెలుసుకుందాం..!
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
కొత్తిమీర (ఒకపెద్ద కట్ట) బిర్యానీ ఆకు (2) యాలకులు (నాలుగు) దాల్చిన చెక్క (చిన్నముక్క) లవంగాలు (4) కర్వేపాకు జీడిపప్పు వేరుశనపప్పు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం నెయ్యి నూనె పసుపు ఉప్పు రెడీ చేసుకున్న అన్నం
తయారీ విధానం :
ముందుగా కొత్తిమీర ను శుభ్రం చేసుకుని దానిని మిక్సీ లో వేసి కొత్తిమీరతో పాటు ఐదు పచ్చి మిర్చి, అల్లం వేసి పేస్టు రెడీ చేసుకోవాలి. తర్వాత బాణలి స్టౌ మీద పెట్టి.. కొంచెం నూనె రెండుస్పూన్ల నెయ్యి వేసుకుని కొంచెం వేడి ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు,యాలకులు దాల్చిన చెక్క , లవంగాలు వేసి వేయించాలి. తర్వాత జీడిపప్పు, వేరుశనగ పప్పు వేసి వేయించి తర్వాత కర్వేపాకు, వేరుశనపప్పు , ఎండుమిర్చి , మినపప్పు , శనగపప్పు , ఆవాలు , జీలకర్ర వేసి వేయించాలి తర్వాత కొత్తిమీర పేస్ట్ ను వేసుకుని పసుపు .. కొంచెం ఉప్పు వేసుకుని పచ్చి స్మెల్ పోయేవరకూ కొత్తిమీర పేస్ట్ ను వేయించాలి.. కమ్మటి వాసన వచ్చిన తర్వాత అందులో రెడీ చేసిన అన్నం వేసుకుని పేస్ట్ కలిసేలా కలుపుకోవాలి.. తర్వాత రుచి ఉప్పు సరిపోకపోతే అదనంగా మరికొంత వేసుకోవాలి. అంతే ఎంతో రుచి కరమైన కొత్తిమీర రైస్ తయారు.. దీనిలో రైతా (పెరుగు పచ్చడి) చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
Also Read: కరోనా ఆయుర్వేద ముందుకు పేరు పెట్టిన ఆనందయ్య.. మొదట లక్షమందికి పంపిణీ కోసం ఏర్పాట్లు..