India Covid-19: ఆ 12 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయ్.. కేంద్రం

India Coronavirus: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌గా నాలుగు ల‌క్ష‌ల‌కుపైగానే

India Covid-19: ఆ 12 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయ్.. కేంద్రం
India Corona
Follow us

|

Updated on: May 07, 2021 | 7:07 PM

India Coronavirus: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌గా నాలుగు ల‌క్ష‌ల‌కుపైగానే కొత్త కేసులు న‌మోద‌వుతుండగా.. మూడు వేలమందికి పైగా బాదితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీందో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించినప్పటికీ.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, హర్యానా, బీహార్‌లోనే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 12 రాష్ట్రాల్లోనే భారీగా కేసులు వెలుగులోకి వస్తున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి ఆర్తి అహుజా శుక్రవారం వెల్లడించారు.

అయితే.. మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇటీవ‌ల కేసులు బాగా పెరిగి.. మళ్లీ క్ర‌మంగా త‌గ్గుతున్నాయ‌ని ఆర్తి అహుజా వివరించారు. పంజాబ్‌, జ‌మ్ముక‌శ్మీర్‌, అస్సాం, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, మేఘాల‌యా, త్రిపుర‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, నాగాలాండ్ రోజూవారీ కొత్త కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తుందని.. తెలిపారు. గతంలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్‌, హ‌ర్యానా, ఒడిశా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయ‌ని ఆర్తి అహుజా తెలిపారు.

ఇదిలాఉంటే.. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ కూడా వేగవంతంగా కొసాగుతుంద‌ని ఆర్తి ఆహుజా వివరించారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 16.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన‌ట్లు ఆమె తెలిపారు. కాగా.. 18-44 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి కూడా ఇప్ప‌టివ‌ర‌కు 11.81 ల‌క్ష‌ల డోసుల టీకాలు ఇచ్చిన‌ట్లు వివరించారు.

Also Read:

Breaking News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..

Indian Railways: కరోనా ఎఫెక్ట్‌.. దూరంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా 28 రైళ్లు రద్దు.. ఎప్పటివరకంటే..?

Latest Articles
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్