AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా బయటపడ్డ అద్భుతం

అద్దంకిలో అద్భుతం జరిగింది. గజాననుడి గర్భాలయ రహస్యం బయటపడింది. పండుగ రోజు పొలంలో కుడి తొండం గణపతి వెలిసింది. 600 ఏళ్ల నాటి చారిత్రకు సాక్ష్యంగా నిలిచింది. రైతు నాగలికి తగిలింది రాయి కాదని, అది సాక్షాత్తూ విజయనగరరాజుల కాలంనాటి విఘ్నేశ్వరుడేనని తేలింది.

Andhra: అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా బయటపడ్డ అద్భుతం
Andhra News
Fairoz Baig
| Edited By: |

Updated on: Jan 17, 2026 | 6:26 PM

Share

చరిత్ర ఎప్పుడూ తన ఆనవాళ్లను భూమి పొరల్లో దాచి ఉంచుతుంది. సమయం వచ్చినప్పుడు అవి ఇలా వెలుగు చూస్తాయి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామం ఇప్పుడు ఒక చారిత్రక అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది. సంక్రాంతి పండుగ వేళ పంట పొలానికి నీళ్లు కట్టేందుకు వెళ్లిన రైతుకు.. అనూహ్య రీతిలో ఆ గణనాథుడు దర్శనమిచ్చాడు. రైతు వీరనారాయణ తన మొక్కజొన్న చేనుకు నీరు పెడుతుండగా.. కాలువ గట్టున ఒక రాయి అడ్డుగా ఉంది. గతంలో జేసీబీతో మట్టి తీసినప్పుడు ఆ రాయి కొంచెం బయటపడింది. కానీ దానిపై నీళ్లు చల్లి శుభ్రం చేయగా.. అద్భుతమైన వినాయక విగ్రహంగా ప్రత్యక్షమైంది.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

విజయనగరరాజుల కాలం నాటిది..

ఈ విగ్రహంపై పురావస్తు శాఖ రిటైర్డ్‌ అధికారి జ్యోతి చంద్రమౌళి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ విగ్రహం సుమారు 14వ శతాబ్దానికి అంటే విజయనగర రాజుల కాలానికి చెందినదిగా ఆయన ధృవీకరించారు. సాధారణంగా వినాయకుడి తొండం ఎడమ వైపు ఉంటుంది. కానీ ఇక్కడ కుడి వైపుకు తిరిగి ఉండటం విశేషం. చేతిలో ఉన్న ఉండ్రాన్ని తింటున్నట్లుగా ఉన్న ఈ శిల్పకళ అత్యంత అరుదైనది. ఈ ప్రాంతంలో గతంలో భారీ శివాలయం ఉండేదని, కాలక్రమేణా అది భూస్థాపితమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం తెలియగానే చినకొత్తపల్లికి భక్తులు పోటెత్తుతున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వంటి వారు సైతం ఈ వార్త చూసి తమ గ్రామంలో వెలుగుచూసిన విగ్రహాన్ని చూసేందుకు తరలివచ్చారు. గ్రామంలోని పండితులు, సిద్ధాంతులతో చర్చించి ఈ విగ్రహానికి తగిన రీతిలో ఆలయాన్ని నిర్మించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.

పూజలు చేస్తున్న గ్రామస్థులు..

బాపట్ల జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామంలో విగ్రహం లభించిన ప్రదేశంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో శైవ మతం విరివిగా వ్యాపించి ఉండటం వల్ల.. ఇక్కడ ఒక శివాలయం ఉండవచ్చని, కాలక్రమేణా అది భూస్థాపితమై ఈ విగ్రహం బయటపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పురాతన వినాయక విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, గ్రామ పెద్దలతో చర్చించి ఒక ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ అరుదైన విగ్రహం తమ గ్రామంలో బయటపడటం గ్రామస్థులందరి అదృష్టమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అరుదైన శిల్పం..

సంక్రాంతి పండుగ వేళ ఈ పురాతన విగ్రహం బయటపడటంతో చినకొత్తపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పురావస్తు శాఖ దీనిపై మరింత పరిశోధన చేస్తే మరిన్ని చారిత్రక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పొలాల్లో బయటపడ్డ ఈ గణపతి.. అద్దంకి ప్రాంత ప్రాచీన వైభవానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. ప్రభుత్వం స్పందించి ఇక్కడ మరిన్ని తవ్వకాలు జరిపితే, ఇంకెన్నో చారిత్రక రహస్యాలు వెలుగుచూసే అవకాశం ఉందని ప్రముఖ చారిత్రక పరిశోథకులు జ్యోతి చంద్రమౌళి అభిప్రాయపడుతున్నారు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..