సెల్ ఫోన్, బైక్ కోసం మూడు నెలల బిడ్డను అమ్మిన ఓ తండ్రి..

ఆడ పిల్ల అంటేనే అంగడి సరుకు మారింది. విలాస జీవితానికి అలవాటు పడ్డ ఓ కసాయి తండ్రి కన్నకూతురునే అమ్మేశాడు. ఎంచక్కా వచ్చిన సొమ్ముతో ఓ బైకు, సెల్ ఫోన్ కొనుక్కొని ఎంజాయ్ చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

సెల్ ఫోన్, బైక్ కోసం మూడు నెలల బిడ్డను అమ్మిన ఓ తండ్రి..
Follow us

|

Updated on: Aug 30, 2020 | 4:23 PM

ఆడ పిల్ల అంటేనే అంగడి సరుకు మారింది. విలాస జీవితానికి అలవాటు పడ్డ ఓ కసాయి తండ్రి కన్నకూతురునే అమ్మేశాడు. ఎంచక్కా వచ్చిన సొమ్ముతో ఓ బైకు, సెల్ ఫోన్ కొనుక్కొని ఎంజాయ్ చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఆడపిల్ల పుట్టిందని తరుచు భార్యతో గొడవకు పడుతుండేవాడు. ఇదే క్రమంలో కూతురిని వదిలించుకోవాలనుకున్నాడు. మూడు నెలల వయసున్న పనికందును ఆ నిందితుడు లక్ష రూపాయలకు సంతానం లేని దంపతులకు అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బుతో రూ. 50 వేలు పెట్టి ఓ బైక్, మరో రూ. 15 వేలు పెట్టి ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడని. కూలీ పని చేసుకునే వ్యక్తి విలాసాలకు పోతుండటంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు ఆ చిన్నారిని కాపాడారు.

నిందితుడి భార్యను వారు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భర్త బెదిరింపులకు లొంగిపోయే తాను కన్నబిడ్డను అమ్మేందుకు అంగీకరించినట్టు ఆమె విచారణలో తెలిపింది. అంతేకాకుండా.. పాపను తిరిగి తనకు అప్పగించాలని కూడా అధికారులను కోరినట్టు సమాచారం. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.