కేటీఆర్‌కు త్వరలో ప్రమోషన్.. ఇండికేషన్ ఇదే

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు త్వరలో ప్రమోషన్ లభించనున్నదా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? తాజాగా మునిసిపల్ ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో దేశంలోనే ఓ రికార్డు స్థాయిలో సాధించిన విజయంతో కేటీఆర్‌కు త్వరలోనే ప్రమోషన్ ఖాయమని ప్రచారం జోరందుకుంది. అందుకు ఫిబ్రవరి నెలే ముహూర్తమని తెలంగాణ భవన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేటీఆర్.. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్టటిన రెండు రోజులకే రెండో పవర్ సెంటర్‌గా మారిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ తన తనయుడు […]

కేటీఆర్‌కు త్వరలో ప్రమోషన్.. ఇండికేషన్ ఇదే
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 25, 2020 | 7:53 PM

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు త్వరలో ప్రమోషన్ లభించనున్నదా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? తాజాగా మునిసిపల్ ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో దేశంలోనే ఓ రికార్డు స్థాయిలో సాధించిన విజయంతో కేటీఆర్‌కు త్వరలోనే ప్రమోషన్ ఖాయమని ప్రచారం జోరందుకుంది. అందుకు ఫిబ్రవరి నెలే ముహూర్తమని తెలంగాణ భవన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

కేటీఆర్.. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్టటిన రెండు రోజులకే రెండో పవర్ సెంటర్‌గా మారిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ ప్రకటించినప్పట్నించి ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, వచ్చే పదేళ్ళు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పడంతో ఈ దఫా పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని అందరూ భావించారు. అయితే, సాక్షాత్తు కేసీఆర్ స్వయంగా చెప్పినప్పటికీ.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు అడపాదడపా కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని ప్రకటిస్తూనే వున్నారు.

తాజాగా తన సారథ్యంలో మునిసిపల్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం పార్టీకి సంపాదించిపెట్టిన కేటీఆర్.. ముఖ్యమంత్రి పీఠానికి, పార్టీ అధ్యక్ష బాధ్యతలకు పూర్తి స్థాయిలో అర్హుడని పార్టీ వర్గాలు కృతనిశ్చయానికి వచ్చాయి. దీనికి తోడు చేపట్టిన ప్రతీ టాస్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్న కేటీఆర్ అటు పరిపాలనలో తన సత్తా చాటుతున్నారు. ఇటు పార్టీవర్గాలను విజయం దిశగా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళుతున్నారు.

ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కంటే ముందే కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని కేసీఆర్ అప్పగిస్తారని అందరూ అనుకుంటున్నారు. దానికి ముహూర్తం కూడా ఖరారైందని చెప్పుకుంటున్నారు. అయితే, కేసీఆర్ మరో ఏడాది సీఎంగా కొనసాగాలనుకుంటున్నారని పార్టీలో మరో వర్గం చెప్పుకుంటుంది. ఈ రెండో వర్గం అంఛనా నిజమైతే.. ఫిబ్రవరిలో పార్టీ పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను కేటీఆర్‌కు గులాబీ దళపతి అప్పగిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా.. ఫిబ్రవరి నెలలో కేటీఆర్ అయితే ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షునిగా కొత్త బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.