సీఏఏకు రాజస్థాన్ సైతం వ్యతిరేకం.. అసెంబ్లీ ఆమోదం
వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్తాన్ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. శనివారం అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం ఆమోదానికి నోచుకుంది. దీంతో కేరళ, పంజాబ్ తరువాత ఈ చట్టాన్ని వ్యతిరేకించిన మూడో రాష్ట్రమైంది. సీఏఏకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు సభ పోడియం వద్దకు దూసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అంతకుముందు సీఎం అశోక్ గెహ్లాట్ కేబినెట్… సీఏఏ వ్యతిరేక ప్రతిపాదనను ఓ సర్క్యులేషన్ ద్వారా ఆమోదించింది. ఈ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు […]

వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్తాన్ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. శనివారం అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం ఆమోదానికి నోచుకుంది. దీంతో కేరళ, పంజాబ్ తరువాత ఈ చట్టాన్ని వ్యతిరేకించిన మూడో రాష్ట్రమైంది. సీఏఏకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు సభ పోడియం వద్దకు దూసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అంతకుముందు సీఎం అశోక్ గెహ్లాట్ కేబినెట్… సీఏఏ వ్యతిరేక ప్రతిపాదనను ఓ సర్క్యులేషన్ ద్వారా ఆమోదించింది. ఈ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయబోదని గెహ్లాట్ ప్రకటించారు. ‘సంవిధాన్ బచావో ర్యాలీ’ పేరిట ఈ చట్టాన్ని నిరసిస్తూ ఈ నెల 22 న జరిగిన ఓ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించడం కూడా విశేషం.