AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా.. భారత్!

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షిక స్థాయిలో తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. 2019లో ఏడు శాతం వృద్ధితో 158 మిలియన్ ఎగుమతులకు చేరుకుంది. 2019లో షియోమి 28 శాతం మార్కెట్ వాటాతో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతుండగా, శామ్‌సంగ్ 21 శాతంతో రెండో స్థానంలో, వివో 16 శాతం మార్కెట్ వాటాతో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ‘మార్కెట్ మానిటర్’ తాజా నివేదికలో పేర్కొంది. చైనా బ్రాండ్ల వాటా […]

రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా.. భారత్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 25, 2020 | 10:17 PM

Share

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షిక స్థాయిలో తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. 2019లో ఏడు శాతం వృద్ధితో 158 మిలియన్ ఎగుమతులకు చేరుకుంది. 2019లో షియోమి 28 శాతం మార్కెట్ వాటాతో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతుండగా, శామ్‌సంగ్ 21 శాతంతో రెండో స్థానంలో, వివో 16 శాతం మార్కెట్ వాటాతో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ‘మార్కెట్ మానిటర్’ తాజా నివేదికలో పేర్కొంది.

చైనా బ్రాండ్ల వాటా 2019 సంవత్సరానికి 72 శాతానికి చేరుకుంది, ఇది గత ఏడాది 60 శాతం ఉంది. “ఈ సంవత్సరం, అన్ని ప్రధాన చైనా మోడళ్ళు షియోమి, రియల్‌మీ, వన్‌ప్లస్ తమ ఆఫ్‌లైన్ అమ్మకాల పాయింట్లను పెంచగా, వివో వంటి బ్రాండ్లు తమ ఆన్‌లైన్ పరిధిని విస్తరించాయి. గత నాలుగు సంవత్సరాల్లో షియోమి, వివో, వన్‌ప్లస్ అమ్మకాలు వరుసగా 15 రెట్లు, 24 రెట్లు, 18 రెట్లు పెరిగాయి. శామ్‌సంగ్ ఎగుమతులు 2019 లో దాదాపు ఐదు శాతం క్షీణించాయి.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేయగా, ఫీచర్ ఫోన్ మార్కెట్ 2019లో దాదాపు 42 శాతం క్షీణించింది. కాగా.. 2019 ఆఖరి త్రైమాసికంలో ఐటెల్ నంబర్ వన్ ఫీచర్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది, తరువాత శామ్‌సంగ్ మరియు లావా ఉన్నాయి.

Follow Us
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్