AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ రాజధాని రగడపై కేటీఆర్ సెటైర్

ఏపీలో కొనసాగుతున్న రాజధాని రగడపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణలో జిల్లాల విభజనను ప్రశాంతంగా ఎలాంటి సమస్య లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని, కొన్ని రాష్ట్రాలలో రాజధాని విభజన అంటేనే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి అంటూ పరోక్షంగా ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజధాని రచ్చను ప్రస్తావించారు కేటీఆర్. మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్వాన్ని తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ శుక్రవారం సమీక్షించారు. పలువురితో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి గ్రౌండ్ లెవెల్ […]

ఏపీ రాజధాని రగడపై కేటీఆర్ సెటైర్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 17, 2020 | 9:07 PM

Share

ఏపీలో కొనసాగుతున్న రాజధాని రగడపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణలో జిల్లాల విభజనను ప్రశాంతంగా ఎలాంటి సమస్య లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని, కొన్ని రాష్ట్రాలలో రాజధాని విభజన అంటేనే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి అంటూ పరోక్షంగా ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజధాని రచ్చను ప్రస్తావించారు కేటీఆర్. మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్వాన్ని తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ శుక్రవారం సమీక్షించారు. పలువురితో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని తెలుసుకున్నారు.

ఎన్నికల సమీక్ష తర్వాత కేటీఆర్ మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగానే ఏపీ రాజధాని రగడపై సెటైర్లు వేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో కేవలం 10 జిల్లాలుండగా.. వాటిని 32 జిల్లాలుగా విభజించామని, మొత్తం ప్రాసెస్ ఎలాంటి గొడవలు లేకుండా ముగిసిందని అంటూనే.. కొన్ని రాష్ట్రాలలో రాజధాని విభజన అంటేనే గొడవలు జరుగుతున్నాయని పరోక్షంగా ఏపీ రాజధాని రగడను ప్రస్తావించారయన.

కేటీఆర్ ఈ సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు ఇస్తే వాటిని ఎవరు నెరవేర్చాలని ఆయన ప్రశ్నించారు. మునిసిపల్ మంత్రిగా కొత్త మునిసిపల్ చట్టాన్ని అమలు చేయడమే తన ముందు ఉన్న సవాల్ అని ఆయన చెప్పారు. తానున కాబోయే సీఎం అన్న ప్రచారంలో నిజం లేదని, కొందరు మంత్రులతో ఈ అంశాన్ని మీడియానే మాట్లాడిస్తోందని అన్నారు.

జీహెచ్ఎంసీని విభజించే ఆలోచనేది తమ ప్రభుత్వానికి లేదన్నారు కేటీఆర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మెట్రో సిటీల్లో ఎక్కడైనా లక్ష ఇళ్ళు కట్టారా? ఇక్కడ ఎందుకు సాధ్యం కాని హామీలను బీజేపీ నేతలు ఇస్తున్నారని అడిగారు ఆయన. ఇంకా నాలుగు ఏళ్ళు అధికారంలో వుంటాం కాబట్టి.. తమ ప్రభుత్వం లక్ష్యం ప్రకారం ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేస్తుందని చెప్పారయన.

చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?