రసవత్తరంగా ‘కార్తీకదీపం’.. హిమ తనకూతురే అని దీప చెప్పేసిందా?

దీప, కార్తిక్‌లతో ‘కార్తీక దీపం’ సీరియల్ ఓ రేంజ్‌లో దూసుకెళ్తుంది. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్స్‌లో ఇదే ఫస్ట్ నిలుస్తోంది. 17వ తేదీ రాత్రి కార్తీక దీపం సీరియల్ ఎంతో రసవత్తరంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్‌లో హిమ తన కూతురే అని దీప కార్తీక్‌కి చెప్పేస్తానంటుంది. మరి ఆరువాత ఏయిందో మీరే చదవండి. హిమ తన కూతురే అని కార్తీక్‌కి చెప్పేస్తానని బయలు దేరిన దీపని.. సౌందర్య ఆపేస్తుంది. ఆ తరువాత […]

రసవత్తరంగా 'కార్తీకదీపం'.. హిమ తనకూతురే అని దీప చెప్పేసిందా?
Follow us

| Edited By:

Updated on: Jan 17, 2020 | 10:33 PM

దీప, కార్తిక్‌లతో ‘కార్తీక దీపం’ సీరియల్ ఓ రేంజ్‌లో దూసుకెళ్తుంది. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్స్‌లో ఇదే ఫస్ట్ నిలుస్తోంది. 17వ తేదీ రాత్రి కార్తీక దీపం సీరియల్ ఎంతో రసవత్తరంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్‌లో హిమ తన కూతురే అని దీప కార్తీక్‌కి చెప్పేస్తానంటుంది. మరి ఆరువాత ఏయిందో మీరే చదవండి.

హిమ తన కూతురే అని కార్తీక్‌కి చెప్పేస్తానని బయలు దేరిన దీపని.. సౌందర్య ఆపేస్తుంది. ఆ తరువాత కార్తీక్, హిమలు ఇంటికి చేరుకుంటారు. హిమ పడుకుంటుంది. కార్తిక్ దీర్ఘాలోచనలో పడతాడు. ఇంతలో హిమ కళ్లు తెరుస్తుంది. గుడ్ మార్నింగ్ హిమా అంటాడు కార్తిక్ నవ్వుతూ. హిమ కూడా గుడ్ మార్నింగ్ డాడీ అంటుంది. ఎలా ఉందిరా? నీరసంగా ఉందా అంటూ పలకరిస్తూనే.. మనం ఈరోజు బయటకెళ్దాం అంటాడు కార్తిక్. దానికి హిమ సరే డాడీ అంటుంది. దీంతో కార్తిక్ కిందకు దిగి హిమ కోసం పాల తీసుకెళ్తుండగా.. సౌందర్య ఎదురుపడుతుంది.

దీంతో.. ఇద్దరూ షరామాములుగానే హిమ విషయంలో గొడవపడతారు. ఎంట్రా.. హిమకి నేను అన్ని నూరిపోస్తున్నాననా? అంటూ సౌందర్య ఫైర్ అవుతుంది. దానికి కార్తిక్ కూడా ధీటుగా సమాధానం ఇస్తాడు. దీంతో సౌందర్య తల కొట్టుకుంటూ.. అనుమానం పుట్టి తర్వాత వీడు పుట్టాడు..అయినా కర్మ కాకపోతే.. కన్నది నేనేగా అంటుంది.

ఇక దీప ఎంతో బాధగా కుర్చొని, శౌర్య గురించి ఆలోచిస్తూ కార్తిక్‌ని తిట్టుకుంటుంది. ఈ లోపు శౌర్య ఎంట్రీ ఇచ్చి నేను స్కూల్‌కి వెళ్తున్నా అంటూ గట్టిగా అరుస్తుంది. దానికి దీప ఎందుకు అలా అన్ని సార్లు చెబుతున్నావ్ అంటుంది. అంటే.. నేను తినకపోయినా నీకు ఫర్వాలేదా? రాత్రి అలానే వదిలేశావ్.. చిన్న పిల్లని నాకు ఆకలి వెయ్యదా? అంటుంది అయాకంగా మొఖం పెట్టి.. దానికి దీప నవ్వుతూ.. అది కాదు అత్తమ్మా, నాకు పంతం ఉండదా? రాత్రి బాధలో ఉండి.. నిన్ను పట్టించుకోలేదు అంటూ సారీ చెప్పి, నీకు ఇష్టమని ఇడ్లీ, పల్లీల చెట్నీ చేశారు రా తిందువు అంటూ శౌర్యకి తినిపిస్తుంది.

ఆ తరువాత మౌనిత, ప్రియమణిలు ఎంట్రీ ఇస్తారు. ఉల్లిపాయలు కొనడానికని బయటకి బయలుదేరతారు. ఈలోపు ఓదొంగ ప్రియమణి చైన్ కొట్టేస్తాడు. ఆ దొంగను పట్టుకుని ప్రియమణి వాడిని కొడుతుంది. ఇక్కడ వీళ్లు చేసిన కామెడీకి నవ్వులు పువ్వులు పూయక తప్పదు. ఈలోగా పోలీస్ వచ్చి అతన్ని పట్టుకుంటాడు. దొంగని తీసుకుని పోలీస్ వెళ్తుంటే దొంగ.. పర్స్ పాడేసుకుంటాడు. అది చూసిన మౌనిత వాళ్లని పిలిచి పర్స్ దొంగకు ఇచ్చి.. వీడ్ని వదిలేయండి అని పోలీస్‌కి చెబుతుంది. అక్కా నువ్వు దేవతవి అంటూ దొంగ మౌనితని పొగుడుతాడు. అప్పుడే మళ్లీ అక్కడికి కార్తిక్ ఎంట్రీ ఇస్తాడు.

అదేంటి మౌనిత వాడ్ని వదిలేమన్నావ్ అని అడుగుతాడు. దానికి మౌనిత వయ్యారాలు వలకబోసి.. వాడిపేరు కార్తిక్ అందుకే వదిలేయమన్నా అని మురిసిపోతుంటుంది. అది గమనించని కార్తిక్ నువ్వు చేసింది తప్పు అంటాడు. దానికి మౌనిత నువ్వేంటి ఇక్కడున్నావ్ అని అడుగుతుంది. అందుకు కార్తిక్ నీకోసమే వచ్చాను అంటాడు. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు.

ఈలోపు హిమ రెడీ అయి వాళ్ల డాడీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇదే అదునుగా భావించిన సౌందర్య.. హిమతో వాళ్ల అమ్మ ఎవరో.. కార్తిక్ ఎందుకు విడాకులు ఇస్తున్నాడో.. గట్టిగా అడుగమ్మా అంటూ చెబుతుంది. గుర్తు పెట్టుకో.. వివరాలు తెలుసుకునేదాకా వదిలిపెట్టకమ్మా అంటు చెప్తుంది. దానికి హిమ కూడా సరే అంటుంది. ఇక ఆతరువాత ఏం జరుగుతుందో రేపటి వరకూ ఎదురు చూడక తప్పదు.

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..