Old Currency: పాత, చిరిగిన నోట్లను బ్యాంకుల్లో మారుస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

RBI Old Notes: చిరిగిన, పాతపడిపోయిన నోట్లను చాలామంది పనికిరావని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం..

Old Currency: పాత, చిరిగిన నోట్లను బ్యాంకుల్లో మారుస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
Old Notes
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2021 | 8:59 AM

చిరిగిన, పాతపడిపోయిన నోట్లను చాలామంది పనికిరావని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. ఆ నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు అని చెబుతోంది. చిరిగిన, పాత నోట్లను మార్చేందుకు బ్యాంకులు పలు ఛార్జీలను వసూలు చేస్తాయి. అసలు బ్యాంకులు ఎంతెంత ఛార్జీలు వసూలు చేస్తాయి.? వేటిని పరిగణలోకి తీసుకుంటాయి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!

ఎలా మార్చవచ్చు?

మీ వద్ద పాత లేదా చిరిగిన నోట్లు ఉంటే, మీరు వాటిని దగ్గరలోని బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకోవచ్చు. మీరు ఇచ్చిన నోట్లకు అదే మొత్తంలో డబ్బు తిరిగి ఇస్తారని మాత్రం అనుకోవద్దు. ప్రతీ నోటును మార్చేందుకు బ్యాంకు కొంత ఛార్జీ వసూలు చేస్తుంది. ఉదాహరణకు.. 2000 రూపాయల నోటు 88 చదరపు సెంటీమీటర్లు అయితే, మీకు పూర్తి డబ్బు లభిస్తుంది. కానీ 44 చదరపు సెం.మీ.లో ఉంటే సగం మొత్తం ఇస్తారు. అలాగే మీరు 200 రూపాయల చిరిగిన నోటు 78 చదరపు సెంటీమీటర్లు అయితే.. మీకు పూర్తి డబ్బు లభిస్తుంది. కానీ 39 చదరపు సెంటీమీటర్ల నోటుకు అయితే.. సగం డబ్బు వస్తుంది.

ఎంత వసూలు చేస్తారు?

మీ దగ్గర రూ. 20 నోట్లు.. రూ. 5 వేల కంటే తక్కువ ఉంటే.. ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూ. 5 వేలు దాటితే మాత్రం ఛార్జీ పడుతుంది. 20 కంటే ఎక్కువ నోట్లు ఉంటే, ఒక్కో నోటుపై రెండు రూపాయలు వసూలు చేస్తారు. అంతేకాకుండా జీఎస్టీ అదనంగా చెల్లించాలి. ఒకవేళ రూ. 5 వేల కంటే విలువ ఎక్కువ ఉంటే.. నోట్‌కు రూ.2 నుంచి రూ. 5 చెల్లించాలి.

ఎలాంటి నోట్లు మార్చబడవు..!

పాత, చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చునని ఆర్బీఐ సూచించింది. అయితే, కాలిన లేదా చెదలుపట్టిన నోట్లను మార్చుకోవడం కుదరదని తేల్చింది. అలాగే మీరు ఉద్దేశపూర్వకంగా నోటును చింపినా లేదా కత్తిరించినట్లు బ్యాంక్ అధికారి గుర్తిస్తే, అలాంటి నోట్లను తీసుకోరు అని స్పష్టం చేసింది.

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!