Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు అయ్యే దేశాలు ఏంటో తెలుసా..? ఆ నిబంధనలు తప్పనిసరి

Indian Driving License: కారులో షికారుకు వెళ్లేవారు చుట్టుపక్కల అందాలను చూస్తూ డ్రైవింగ్‌ చేస్తుంటే ఎంతో ఎంజాయ్‌ ఉంటుంది. అదే విదేశాలలో ఈ ఎంజాయ్‌మెంట్‌ అంతా..

Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు అయ్యే దేశాలు ఏంటో తెలుసా..? ఆ నిబంధనలు తప్పనిసరి
Indian Driving License
Follow us
Subhash Goud

|

Updated on: Jun 24, 2021 | 9:20 AM

Indian Driving License: కారులో షికారుకు వెళ్లేవారు చుట్టుపక్కల అందాలను చూస్తూ డ్రైవింగ్‌ చేస్తుంటే ఎంతో ఎంజాయ్‌ ఉంటుంది. అదే విదేశాలలో ఈ ఎంజాయ్‌మెంట్‌ అంతా ఇంతా కాదు. ఇక అక్కడ డ్రైవింగ్‌ చేయాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. అయితే భారత్‌కు చెందిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ పది దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. అక్కడి రోడ్లపై భారతీయులు డ్రైవింగ్‌ చేసే అవకాశం ఉంది. ఆ దేశాలు ఏమిటో తెలుసుకుందాం.

జర్మనీ

జర్మనీలో ఇండియా డ్రైవింగ్‌ లైసెన్స్‌తో వాహనాలు నడపవచ్చు. అయితే మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కాపీ ఇంగ్లీషులో కానీ, జర్మనీలో కానీ ఉంటే అక్కడి అధికారులకు సులభంగా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది ఉండదు.

బ్రిటన్‌:

బ్రిటన్‌లో అయితే ఏడాది పాటు భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అనుమతి ఇస్తారు. స్కాట్లాండ్‌, ఇంగ్లాండ్‌, వేల్స్‌ దేశాలలో సంవత్సరం పాటు భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌తో వాహనాలు నడుపుకోవచ్చు.

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియాలోనూ ఇండియన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఆ దేశం అనుమతి ఇస్తుంది. అయితే చిన్న చిన్న షరతులు మాత్రం తప్పనిసరి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇంగ్లీష్‌లో ఉండాలి. ఇండియన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు మూడు నెలల పాటు మాత్రమే అనుమతి ఉంటుంది. మనదేశంలోలాగే ఆస్ట్రేలియాలో కూడా ఎడమవైపే డ్రైవింగ్‌ చేయాలి.

న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌లో బస చేసే విదేశీయులు తమ మాతృదేశ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో నే ఏడాది పాటు వాహనాలు నడపవచ్చు.అయితే మీకు ఏ వాహనం నడపడానికి లైసెన్స్‌ మంజూరు అయి ఉందో ఆ వాహనం మాత్రమే నడపాలి. లేకపోతే అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు.

స్విట్జార్లాండ్‌:

స్విట్జార్లాండ్‌లో కూడా ఏడాది పాటు మన దేశ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఉపయోగించి వాహనం నడపుకోవచ్చు. ఇక్కడ మన లైసెన్స్‌తో వాహనాలు లీజుకు కూడా ఇచ్చుకోవచ్చు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ఇంగ్లీషులో ఉండాలి.

ద‌క్షిణాఫ్రికా:

దక్షిణాఫ్రికాలో కూడా భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అనుమతి ఇస్తారు. కాకపోతే లైసెన్స్‌ కాపీ ఇంగ్లీష్‌లో ఉండాలి. అంతేకాదు లైసెన్స్‌ ప్రస్తుత కాలానికి చెందినదిగా ఉండాలి. అలాగే దానిపై ఫోటో, సంతకం తప్పనిసరి.

స్వీడన్‌:

స్వీడన్‌లో కూడా ఇండియన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అనుమతి ఇస్తారు. కానీ లైసెన్స్‌ ఇంగ్లీష్‌లో లేదా ఫ్రెంచ్‌, నార్వేనియన్‌లో ఉండాలి.

సింగపూర్‌:

సింగపూర్‌లో అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే దేశమంతా చుట్టేయచ్చు. భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఈ దేశంలో ఒక ఏడాది పాటు పని కొస్తుంది.

హాంగ్‌కాంగ్‌:

హాంగ్‌కాంగ్‌లోనూ ఏడాది పాటు భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అనుమతి ఉంది. ఎక్కువ రోజులు టూర్‌ ప్లానింగ్‌ చేసుకునే వారు ఈ దేశంలో వాహనాలు అద్దెకు తీసుకుని ఇండియన్‌ లైసెన్స్‌తో నడుపుకోవచ్చు.

మ‌లేసియా:

మలేషియా రోడ్లపై వాహనాలు నడపాలనుకునే భారతీయులకు వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇంగ్లీష్‌లో కానీ, మలైలో కానీ ఉండాలి. దానిని మలేషియాలో ఇండియన్ ఎంబసీ గుర్తించాల్సి ఉంటుంది.

Fixed Deposits: రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న టాప్‌ 10 బ్యాంకులు

Jet Airways: ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకలాపాలు సాగించనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు..!