వినియోగదారులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్.. మారనున్న పలు అంశాలు.. గ్యాస్.. బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం..
ప్రస్తుత నెల చివరికి... వచ్చే నెల ఆరంభానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ప్రతిసారీ కొత్త నెల ప్రారంభం కావడంతో..
ప్రస్తుత నెల చివరికి… వచ్చే నెల ఆరంభానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ప్రతిసారీ కొత్త నెల ప్రారంభం కావడంతో.. పలు అంశాల్లో కొత్త రూల్స్ కూడా అందుబాటులోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాగే.. పలు అంశాల్లో కొత్త రూల్స్ రానున్నాయి. జూలై 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. గ్యాస్ వినియోగం.. బ్యాంక్ రూల్స్.. ట్యాక్స్ ఇలా ఒక్కటేమిటి.. మనం నిత్యం ఉపయోగించే సరుకులకు సంబంధించిన విషయాల నుంచి ప్రతి నెలా కట్టే ట్యాక్స్ వరకు అన్ని ప్రధాన అంశాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరీ అవెంటో ముందుగానే తెలుసుకుందామా.
ప్రతిసారీ కొత్త నెల మొదటి రోజున సామాన్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇక గ్యాస్ వినియోగదారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సాధారణంగా ప్రతి నెలా ఒకటో తారీఖున మారుతూ ఉంటాయి… అయితే వచ్చే నెల కూడా గ్యాస్ ధరలు మారే అవకాశం ఉంది. అలాగే స్థిరంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. వీటితోపాటు.. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొత్త రూల్స్ తీసుకువస్తుంది. చెక్, ఏటీఎం క్యాష్ విత్ డ్రా రూల్స్ మారనున్నాయి. అంతేకాకుండా ఛార్జీలు కూడా పెంచింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
ఇప్పటికీ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయనివారు ఈ నెల చివరి లోపు ఐటీ రిటర్స్ పని పూర్తి చేయాలి. లేదంటే.. జూలై 1 నుంచి డబుల్ టీడీఎస్ చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు కీలక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఐఎఫ్ఎస్డీ కోడ్స్ చెల్లవు. కొత్తగా కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్డీ కోడ్లు ఉపయోగించాల్సి ఉంటుంది. లేదంటే ఆన్లైన్ లో డబ్బులు పంపించడం కుదరదు. ఇక మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచుతున్నట్లుగా ప్రకటించాయి. ధరల పెంపు జూలై 1 నుంచి అమలు కానుంది. దీంతో కొత్తగా కారు కొనాలనుకునే వారిపై తీవ్ర ప్రభావం పడనుంది.
Old Currency: పాత, చిరిగిన నోట్లను బ్యాంకుల్లో మారుస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!