AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా నాన్న ఎవరో ఎవరూ చెప్పరు ! అంతా తప్పించుకుంటున్నారు’

ఒకరు నాన్న కోసం, మరొకరు తల్లి కోసం పడే తపనలో ఇద్దరు పాపల చుట్టూ తిరుగుతున్న కథలో .. అటు సౌందర్య, ఇటు దీప ఎటూ చెప్పలేక సతమతమవుతూ.. విధిలేక మరేమీ చేయలేక వెర్రి నవ్వులు నవ్వి తమను తాము సమాధానపరచుకుంటున్న వైనం కనిపిస్తుంది లేటెస్ట్ టీవీ సీరియల్ ‘కార్తీకదీపం’ లో ! తాజా ఎపిసోడ్ లో.. కార్తీక్ ఒకవైపు దీపను విపరీతంగా ద్వేషిస్తూ.విడాకుల బాటలో పయనిస్తూ.. . మరోవైపు మౌనితకు దగ్గరపడినట్టు కనిపిస్తూనే ఆమెను ఎంత దూరంలో […]

'మా నాన్న ఎవరో ఎవరూ చెప్పరు ! అంతా తప్పించుకుంటున్నారు'
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 18, 2020 | 11:24 AM

Share

ఒకరు నాన్న కోసం, మరొకరు తల్లి కోసం పడే తపనలో ఇద్దరు పాపల చుట్టూ తిరుగుతున్న కథలో .. అటు సౌందర్య, ఇటు దీప ఎటూ చెప్పలేక సతమతమవుతూ.. విధిలేక మరేమీ చేయలేక వెర్రి నవ్వులు నవ్వి తమను తాము సమాధానపరచుకుంటున్న వైనం కనిపిస్తుంది లేటెస్ట్ టీవీ సీరియల్ ‘కార్తీకదీపం’ లో ! తాజా ఎపిసోడ్ లో.. కార్తీక్ ఒకవైపు దీపను విపరీతంగా ద్వేషిస్తూ.విడాకుల బాటలో పయనిస్తూ.. . మరోవైపు మౌనితకు దగ్గరపడినట్టు కనిపిస్తూనే ఆమెను ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచుతాడు.. హిమ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. మౌనిత దగ్గరకు వచ్చి.. ఆమెనుంచి సాంత్వన పొందడానికి ప్రయత్నిస్తాడు.

అయితే ఆమె వేసే మొండి ప్రశ్నలకు, ఆమె ధోరణికి  ఆగ్రహించి అక్కడినుంచి వెళ్ళిపోతాడు..ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో ఒక చిన్నారి తన నాన్న కోసం వెదుకుతూ.. హిమకు కనబడడం.. అక్కడికి సౌందర్య చేరుకోవడం, హిమ, సౌందర్య.. ‘ మీ నాన్న తప్పకుండా కనిపిస్తాడంటూ ” ఆ చిన్నారికి నచ్ఛజెప్పి పంపిస్తారు .  ఆ తరువాత కథ మామూలే.. స్కూలు లంచ్ అవర్ లో సౌందర్యను శౌర్య కడిగిపారేస్తుంది. ‘ హిమ ఏది? స్కూలుకు రాలేదే ‘ అని శౌర్య అడిగిన ప్రశ్నకు..సౌందర్య.. ‘ వాళ్ళ నాన్నతో వెళ్లింది ‘ అని సమాధానమిస్తుంది.. దాంతో  మండి పడిన శౌర్య.. ” వాళ్ళ నాన్నా ? మరి మా నాన్న ఎవరు? నేను ఎన్నిసార్లు అడిగినా ఎవరూ చెప్పరు.. ఎప్పటికీ మా అమ్మ వంటలక్కలాగే ఉండాలి.. నేను వంటలక్క కూతురిలాగే ఉండాలి ‘ అంటూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోతుంది.

ఇక ఈ ఇద్దరిలో ఎవరిని బుజ్జగించాలి అని సౌందర్య దీపతో బేలగా అంటుంది. దీప, సౌందర్య జస్ట్.. నవ్వులతో తమ బాధను దిగమింగడానికి ప్రయత్నిస్తారు.. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సీన్ హోటల్లో ప్రారంభమవుతుంది. కార్తీక్, హిమ ఎవరి మూడ్ లో వారు ఉంటారు. ‘ హిమా ? ఏమ్మా అలా ఉన్నావు ‘? అని కార్తీక్ అడిగిన ప్రశ్నకు హిమ.. ఒక్కసారిగా ‘ నాకు అమ్మ కావాలి.. అమ్మ ఎక్కడుందో ముందు చెప్పు డాడీ ‘ అంటూ అతడ్ని నిలదీస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక కార్తీక్ షాక్ తింటాడు..

కేవలం మానవ సంబంధాలు, తల్లిదండ్రుల ప్రవర్తనవల్ల వారి పిల్లల్లో కలిగే మానసిక ఒత్తిడులకు, అలాగే వారి అమాయక ప్రశ్నలకు తల్లడిల్లే పెద్దల మనస్తత్వాలను హృద్యంగా మలుస్తున్న సీరియల్ ఇది.. మధ్య మధ్య మౌనిత వంటి యువతులు.. హీరో కార్తీక్ తో పెళ్లి అంటూ అప్పుడప్పుడూ వెంపర్లాడే వైనం కనిపిస్తుంటుంది. కానీ ఆమె ఆశ తీరే మార్గం మాత్రం మనకు కనుచూపుమేరలో కనిపించదు. అలాగే కార్తీక్ తమ్ముడు ఆదిత్య, భాగ్యం,  శ్రావ్య,  ఆమె తండ్రి మురళీకృష్ణ, నాటకంలో పాత్రల్లా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు.