ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు: ఎన్టీఆర్

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) 24వ వర్థంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి కుటుంబం నివాళులు అర్పించింది. తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు కలసి ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి తాత సమాధి వద్ద పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కాసేపు ఘాట్‌లోనే కూర్చొని అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ తాత ఉంటారని, ఆయన భౌతికంగా లేకపోయినా.. ప్రతీ తెలుగు వాడి గుండెల్లో జీవించే ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే.. నందమూరి రామకృష్ణ, […]

  • Updated On - 11:34 am, Sat, 18 January 20 Edited By:
ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు: ఎన్టీఆర్

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) 24వ వర్థంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి కుటుంబం నివాళులు అర్పించింది. తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు కలసి ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి తాత సమాధి వద్ద పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కాసేపు ఘాట్‌లోనే కూర్చొని అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ తాత ఉంటారని, ఆయన భౌతికంగా లేకపోయినా.. ప్రతీ తెలుగు వాడి గుండెల్లో జీవించే ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే.. నందమూరి రామకృష్ణ, పురంధేశ్వరి ఫ్యామిలీ, తదితరులు ఎన్టీఆర్‌కి నివాళి అర్పించారు. కాగా.. మరోవైపు ఇటు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.