పుల్వామాలో ఉగ్రదాడి చేసి 49మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్.. మరోసారి భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు సిద్ధమైంది. పుల్వామా కంటే భారీ ఉగ్రదాడిని చేసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16-17 మధ్య పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ అగ్రనేతలు, ఉగ్రవాదుల మధ్య ఈ సంభాషణ జరిగినట్లు వారు వెల్లడించారు. దీనికి సంబంధించి అధికారులకు హెచ్చరికలు జారీ చేశాయి.
వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చామని ఇంటిలిజెన్స్ అధికారి తెలిపారు. జమ్మూలో లేదంటే.. ఆ రాష్ట్రం బయట ఈ కుట్రకు పన్నినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం గతేడాది డిసెంబర్‌లో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులు సహా 21మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో చొరబడినట్లు చెప్పారు. ఇందులో ఆదిల్ ఒకడు కాగా.. మరో ఇద్దరు దాడికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు.