‘పోకిరి’లో మొదట హీరోయిన్ ఇలియానా కాదట! అసలేం జరిగిందంటే?

'పోకిరి' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులనూ తిరగరాసింది. ఒక్క దెబ్బకి మూడు పిట్టలన్నట్టు....

  • Tv9 Telugu
  • Publish Date - 3:16 pm, Wed, 29 April 20
'పోకిరి'లో మొదట హీరోయిన్ ఇలియానా కాదట! అసలేం జరిగిందంటే?

‘పోకిరి’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులనూ తిరగరాసింది. ఒక్క దెబ్బకి మూడు పిట్టలన్నట్టు.. ఈ ఒక్క సినిమాతో పూరీకి, మహేష్‌కి, ఇలియానాకి ముగ్గురికీ లక్‌ కలిసి వచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006లో ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది.

ఈ సినిమాలో మహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ ఫిల్మ్‌తో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలాగే ఇందులో ఇల్లీ బేబి ఉప్మా డైలాగ్స్ చాలా ఫేమస్ అయిపోయాయి. ఇప్పటికి కూడా అందరూ ఈ ఉప్మా డైలాగ్స్‌ని వాడుతూనే ఉంటారు. అయితే ఈ చిత్రంలో ముందు ఎంపికయ్యింది ఇలియానా కాదట. ముందుగా ఈ సినిమాలో కంగానును అనుకున్నారట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కంగనా.

ఆమె ‘గ్యాంగ్ స్టర్స్’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడే.. పూరీ జగన్నాథ్ కూడా ముంబాయిలో ‘పోకిరి’ సినిమాకి ఆడిషన్స్ తీసుకుంటున్నారట. ఆ సమయంలో కంగనా రెండింటికీ అటెండ్ అయిందట. ఒకేసారి రెండు సినిమాల్లోనూ ఆమె సెలక్ట్ అయిందనే విషయాన్ని చెప్పింది. కానీ ముందుగా డేట్స్‌ని గ్యాంగ్‌స్టర్స్ సినిమాకి ఇచ్చిందట. దాంతో పోకిరీ సినిమా మిస్ అయ్యిందంటూ కంగనా తెలిపింది. అప్పుడే పోకిరి సినిమా చేసి ఉంటే నేను కూడా టాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్ అయ్యేదాన్నంటూ ఇంటర్వ్యూలో పేర్కొంది కంగనా.

అయితే పోకిరిలో ఆ ఛాన్స్ మిస్సయినా.. పూరీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో యాక్ట్ చేసింది కంగనా. కాగా ప్రస్తుతం కంగనా రనౌత్ జయలలిత జీవితంపై తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో మెయిన్ రోల్‌లో నటించింది.

Kangana Ranaut

Read More: గుడ్‌న్యూస్: వడ్డీ లేకుండా అప్పు.. కానీ షరతులు వర్తిస్తాయి!

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి