Covid-19 Mutation: 5 నెలల్లో 11 రూపాల్లోకి మారిన కరోనా వైరస్ …

కోవిద్-19 మహమ్మారి విల తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి సోకి దాదాపు 3 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. జన్యు ఉత్పరివర్తనాల వల్ల

Covid-19 Mutation: 5 నెలల్లో 11 రూపాల్లోకి మారిన కరోనా వైరస్ ...
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 3:55 PM

Covid-19 Mutation: కోవిద్-19 మహమ్మారి విల తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి సోకి దాదాపు 3 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఈ వైరస్‌ ఇప్పటికి పది రకాలుగా మారింది. వాటన్నింటిలోకీ బలమైనది ఏ2ఏ వేరియంట్‌గా శాస్త్రజ్ఞులు తేల్చారు. ఒకరి నుంచి మరొకరికి సోకే సామర్థ్యం, మానవుల ఊపిరితిత్తుల కణాలపై దాడిచేసే సత్తా పుష్కలంగా ఉండడంతో ఈ రకం వైరస్‌.. మిగతావాటన్నింటినీ తోసి‘రాజ’య్యిందని, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచం మొత్తానికీ  పాకిందని మన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

వివరాల్లోకెళితే.. పశ్చిమబెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌కు చెందిన నిధాన్‌ బిశ్వాస్‌, పార్థా మజుందార్‌ ఈ వైర్‌సపై విస్తృత అధ్యయనం చేసి పలు ఆసక్తికరమైన విశేషాలను కనుగొన్నారు. అవేంటంటే.. అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కరోనా సోకినవారి నుంచి సేకరించిన వైర్‌సల ఆర్‌ఎన్‌ఏ జన్యుక్రమాలను సేకరించి విశ్లేషించారు. వాటిలో 1848  (అంటే 50.8ు) ఏ2ఏ రకానివే. 582 సీక్వెన్స్‌లు ‘ఓ’ రకానివి కాగా.. 505 సీక్వెన్స్‌లు ‘బి1’ రకానివి.

మరోవైపు.. భారత్ లో సేకరించిన 35 ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సుల్లో 47.5 శాతం.. అంటే ఏకంగా 16 సీక్వెన్స్‌లు ఏ2ఏ రకానిగా తేలాయి. కాగా.. ‘ఏ3’ రకానివి 13 ఉండగా.. ‘ఓ’.. 5, ‘బి’ రకం ఒకటి ఉన్నాయి. చైనాలో మొదలైన నావెల్‌ కరోనా వైరస్‌ ‘ఓ’ రకానికి చెందినది. దాన్నుంచి ఏ2, ఏ2ఏ, ఏ3, బి, బి1.. ఇలా పది రకాలు పుట్టాయి. ‘ఓ’ కన్నా కూడా ‘ఏ2ఏ’ రకం వైరస్‌ చాలా బలమైనది. సాధారణంగా వైర్‌సల జన్యువుల్లో ఉత్పరివర్తనాలు జరిగినప్పుడు అవి వేరొకరికి సోకే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కొన్ని ఉత్పరివర్తనాలు మాత్రం ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాంటి రకాలు ఒకదశలో తమ పుట్టుకకు కారణమైన అసలు వైర్‌సను సైతం అధిగమించి భారీగా వ్యాపిస్తాయి. ఏ2ఏ రకం అలాంటిదే.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..