విద్యా సాగర్‌ రావుకు సీఎం కేసీఆర్ ఘన నివాళి

తెలంగాణ జల నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా..

విద్యా సాగర్‌ రావుకు సీఎం కేసీఆర్ ఘన నివాళి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 29, 2020 | 3:44 PM

తెలంగాణ జల నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా కేసీఆర్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. విద్యాసాగర్ రావు ఆశయాల మేరకు ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా శ్రమిస్తున్నదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఇంజనీర్లు విద్యాసాగర్ రావు ఇచ్చిన స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా అవతరించిన తెలంగాణ రాష్ట్రమే విద్యాసాగర్ రావుకు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

Read More: 

గుడ్‌న్యూస్: వడ్డీ లేకుండా అప్పు.. కానీ షరతులు వర్తిస్తాయి!

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి