ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. కేంద్ర హోం శాఖ సూచనల మేరకు ఈ సడలింపులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. కేంద్ర హోం శాఖ సూచనల మేరకు ఈ సడలింపులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్సులో భాగంగా హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు మార్గదర్శకాలలో కొన్ని మార్పులు తెచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు నిచ్చారు. ప్లాంటేషన్ పనులు, వరి కోత పనులు, ప్రాసెసింగ్, ప్యాకేజీ, మార్కెటింగ్ పనులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక రంగానికి కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతోపాటు పవర్ లైన్స్. టెలికమ్ కేబుల్ పనులను అనుమతించింది.
కొన్ని ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే ఈ వెసులుబాటు కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే వర్తిస్తుందని షరతు విధించింది.
బుక్స్, స్టేషనరీ, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ వంటి షాపులు తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. షాపింగ్ మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మార్కెట్ కాంప్లెక్సులలో దుకాణాలు తెరచి తమ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు
Read this: రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు
Read this: కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్
Read this: లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు
Read this: ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్
Read this: మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ
Read this: కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?
Read this: సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం
Read this: కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!
Read this: గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి