రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు

మే మూడవ తేదీ తర్వాత దేశంలో లాక్ డౌన్ పొడిగిస్తారో లేదో కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ పొడిగింపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంకో నాలుగు రోజులు మిగిలి ఉండగానే మే 3 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు
Follow us

|

Updated on: Apr 29, 2020 | 7:01 PM

మే మూడవ తేదీ తర్వాత దేశంలో లాక్ డౌన్ పొడిగిస్తారో లేదో కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ పొడిగింపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంకో నాలుగు రోజులు మిగిలి ఉండగానే మే 3 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ 27వ తేదీన జరిగిన ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సులో లాక్ డౌన్ పొడిగింపును సూచించిన పంజాబ్ ముఖ్యమంత్రి.. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోక ముందే తమ నిర్ణయాన్ని ప్రకటించారు. మే 3వ తేదీ నుంచి మరో రెండు వారాలు పంజాబ్ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు.

ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు.. అంటే 5 గంటల పాటు దుకాణాలు తెరచి వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని షరతు విధించింది. దానిక అనుగుణంగా దుకాణం యజమానులు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. సామాజిక దూరం పాటించకపోతే, అందుకు అనుగుణంగా దుకాణం యజమానులు ఏర్పాట్లు చేయకపోతే.. షాపులు తెరుచుకునే వెసులుబాటు కూడా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి పంజాబ్ ప్రజలను హెచ్చరించారు.

Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు

Read this:  ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

Read this:  కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్

Read this:  లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు

Read this:  ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్

Read this:  మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Read this:  కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?

Read this:  సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం

Read this:  కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!

Read this:  గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి