కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!

లాక్‌డౌన్‌తో మొఖం మొత్తిపోయిన కల్లుప్రియులకు ఇది నిజంగానే శుభవార్త. ఏపీలో కల్లుగీతకు ప్రభుత్వం అనుమతించబోతోంది. లాక్‌డౌన్‌కు వరుసగా మినహాయింపులు ప్రకటిస్తున్న జగన్ ప్రభుత్వం తాజాగా కల్లు ప్రియులకు శుభవార్త వినిపించబోతోంది.

కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 29, 2020 | 7:00 PM

లాక్‌డౌన్‌తో మొఖం మొత్తిపోయిన కల్లుప్రియులకు ఇది నిజంగానే శుభవార్త. ఏపీలో కల్లుగీతకు ప్రభుత్వం అనుమతించబోతోంది. లాక్‌డౌన్‌కు వరుసగా మినహాయింపులు ప్రకటిస్తున్న జగన్ ప్రభుత్వం తాజాగా కల్లు ప్రియులకు శుభవార్త వినిపించబోతోంది. రాష్ట్రంలో కల్లు గీసేందుకు అనుమతి ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే కల్లు గీత కార్మికులు సామాజిక దూరం నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలోని కల్లు ప్రియులకు ఇంతకన్నా శుభవార్త లేదని పలువురు భావిస్తున్నారు.

లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. అయితే కొందరు అక్రమార్కులు మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ లాక్‌డౌన్‌కు తూట్లు పొడుస్తున్నారు. అదే సమయంలో మద్యం దుకాణాల్లో చోరీలు కూడా పెరిగిపోయాయి. ఇంకోవైపు నాటుసారా కాసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నాటు సారా కాసి, మద్యం ప్రియులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం పెరిగిపోయిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో ఏకంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా చేరడం విశేషం. ఈ నేపథ్యంలో నాటుసారా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు జగన్ ప్రభుత్వానికి సూచించారు.

అయితే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి మెల్లి మెల్లిగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం కల్లు గీత కార్మికకులకు.. కల్లు గీసేందుకు అనుమతులు జారీ చేయాలని తలపెట్టింది. వేలాది సంఖ్యలో కల్లు గీత కార్మికులు ఉపాధి దూరమైన తరుణంలో ఇది వారికి శుభవార్తగానే భావించాలి. అయితే కరోనా వైరస్ ప్రమాదం ఇంకా పూర్తిస్థాయిలో పోయినందువల్ల కల్లుగీతకు అనుమతి ఇస్తూనే.. కార్మికులు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలి అని షరతు విధించబోతున్నారు. ఈ మేరకు విధివిధానాలను రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఫైనల్ చేస్తున్నట్టు సమాచారం. నేడో, రేపో ఈ ఉత్తర్వులు జారీ అవుతాయని తెలుస్తోంది.

Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు

Read this:  రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు 

Read this:  ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

Read this:  కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్

Read this:  లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు

Read this:  ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్

Read this:  మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Read this:  కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?

Read this:  సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం

Read this:  గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి