కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. పక్క రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వుంటే తెలంగాణలో ఎలా తగ్గుతున్నాయని ఆయన ప్రశ్నించారు.

కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్
Follow us

|

Updated on: Apr 29, 2020 | 7:03 PM

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. పక్క రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వుంటే తెలంగాణలో ఎలా తగ్గుతున్నాయని ఆయన ప్రశ్నించారు. నిజంగా తగ్గితే ఆనందమే కానీ రికార్డుల కోసం, రివార్డుల కోసం ప్రభుత్వం కేసులు తగ్గాయని చెబితే మాత్రం ఘోరమైన తప్పిదం అవుతుందని సంజయ్ కుమార్ హెచ్చరించారు.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా నియమితులైన సంజయ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వైరస్ నియంత్రణ చర్యలపై సంజయ్ కుమార్ స్పందించారు.

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గడం వెనుక ఏదో మతలబు ఉందని సందేహం వ్యక్తం చేశారు సంజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే తెలంగాణలో రివార్డులు రికార్డుల కోసం కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘ తెలంగాణలో ముస్లింల మెప్పుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాకులాడుతున్నారు.. మార్కజ్ సదస్సుకు వెళ్లవచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముస్లింలపై తెలంగాణ ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టడం లేదు.. ముఖ్యమంత్రికి సత్తా ఉంటే హైదరాబాద్ పాతబస్తీకి ఒకసారి వెళ్లి చూడాలి.. ఏ ఒక్కరు కూడా భౌతిక దూరాన్ని పాటించడం లేదు ’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.

కాశీ తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వచ్చిన వారిని ఆదిలాబాద్ కలెక్టర్.. జిల్లాలోకి అనుమతి ఇస్తే.. ప్రభుత్వ ఆదేశాలతో వారిని తిరిగి వెనక్కి పంపించి.. రాత్రంతా రోడ్డుమీద జాగారం చేయించారని, అదే ఢిల్లీ నుంచి మత పెద్దలు వస్తే ఒవైసీ లాంటి నేతలు వాళ్ళను అనుమతిస్తే ప్రభుత్వం ఏమీ చేయడం లేదని బండి ఆరోపించారు.

తెలంగాణలో జరుగుతున్న కరోనా వైరస్ పరీక్షల సంఖ్య ఎందుకు అంత తక్కువగా ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రతి రోజు 2000 టెస్టులు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ సంఖ్యలో పరీక్షలు ఎందుకు నిర్వహిస్తోందని బండి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సరిగా సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కరోనాతో చనిపోతున్న వారి సంఖ్యను ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో తాజా పరిస్థితిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు

మరోవైపు రాష్ట్రంలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది అని ఆరోపించిన బండి సంజయ్ వెల్దుర్తి కొనుగోలు కేంద్రంలో ఉద్యమించిన రైతులతో ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వం కేసులు పెడితే భయపడవద్దని.. తాము అండగా ఉంటామని బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు.

Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు

Read this:  రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు 

Read this:  ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

Read this:  లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు

Read this:  ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్

Read this:  మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Read this:  కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?

Read this:  సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం

Read this:  కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!

Read this:  గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి

ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..