మేక్ ఇన్ ఇండియాలో ఇతడో ఛీటర్!

నిందితుడు రాకేశ్ జంగిద్ ఐఐటీ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా పుండ్లోటా అతడి స్వస్థలం. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ‘‘ఉచిత ల్యాప్‌టాప్ పథకం’’ అంటూ నకిలీ వెబ్‌సైట్ తెరిచాడు. లక్షలాది మందికి ఉచితంగా ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు అందించనుందంటూ వాట్సాప్ తదితర సోషల్ మెసేజింగ్ యాప్‌లలో దుమ్మురేపాడు. కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించాడు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా పెద్ద ఎత్తున వ్యక్తిగత వివరాలు సేకరించి […]

మేక్ ఇన్ ఇండియాలో ఇతడో ఛీటర్!
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 3:07 PM

నిందితుడు రాకేశ్ జంగిద్ ఐఐటీ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా పుండ్లోటా అతడి స్వస్థలం. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ‘‘ఉచిత ల్యాప్‌టాప్ పథకం’’ అంటూ నకిలీ వెబ్‌సైట్ తెరిచాడు. లక్షలాది మందికి ఉచితంగా ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు అందించనుందంటూ వాట్సాప్ తదితర సోషల్ మెసేజింగ్ యాప్‌లలో దుమ్మురేపాడు. కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించాడు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా పెద్ద ఎత్తున వ్యక్తిగత వివరాలు సేకరించి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రకటనలో ప్రధాని మోదీ ఫోటోతో పాటు మేకిన్ ఇండియా లోగోను కూడా జోడించడంతో… పెద్ద ఎత్తున ప్రజలు ఉచిత ల్యాప్‌టాప్‌ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారం ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సైపాడ్ ల్యాబ్స్ సాంకేతిక సాయంతో నిందితుడు రాకేశ్‌ను గుర్తించి అరెస్టు చేశారు. వెబ్‌సైట్ ట్రాఫిక్ పెంచుకుని గూగుల్ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించేందుకే తాను ఈ వెబ్‌సైట్ తెరిచినట్టు రాకేశ్ విచారణలో అంగీకరించాడు. కాగా ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే దానిపై విచారణ జరుపుతున్నట్టు పొలిసులు వెల్లడించారు.

ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు