మోదీని పొగిడిన కాంగ్రెస్ నేతపై బహిష్కరణ వేటు

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు కేరళ కాంగ్రెస్ నేత అబ్దుల్లాకుట్టి. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తూ కేరళ పీసీసీ బహిష్కరణ వేటువేసింది. గాంధీయ విలువలతో పాలన కొనసాగిస్తుండడంతో నరేంద్ర మోదీకి ప్రజాధరణ పెరుగుతోందని ఆయన ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడాన్ని ప్రస్తావిస్తూ…మోదీ అభివృద్ధి అజెండాకు ప్రజలు ఆమోదం తెలిపారని వ్యాఖ్యానించారు. అట్టడగు […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:04 pm, Mon, 3 June 19
మోదీని పొగిడిన కాంగ్రెస్ నేతపై బహిష్కరణ వేటు

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు కేరళ కాంగ్రెస్ నేత అబ్దుల్లాకుట్టి. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తూ కేరళ పీసీసీ బహిష్కరణ వేటువేసింది. గాంధీయ విలువలతో పాలన కొనసాగిస్తుండడంతో నరేంద్ర మోదీకి ప్రజాధరణ పెరుగుతోందని ఆయన ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడాన్ని ప్రస్తావిస్తూ…మోదీ అభివృద్ధి అజెండాకు ప్రజలు ఆమోదం తెలిపారని వ్యాఖ్యానించారు.

అట్టడగు పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ విధానాల రూపకల్పన ఉండాలన్న జాతిపిత మహాత్మాగాంధీ సందేశాన్ని గుర్తుచేస్తూ…మోదీ ఆ మార్గంలో నడుస్తున్నారని మాజీ ఎంపీ అబ్దుల్లా కుట్టి వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన ఇందులో భాగమేనని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్ పథకం ద్వారా 9.26 కోట్ల మంది పేదలకు మరుగుదొడ్లు కట్టించారని, ఆరు కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారని వ్యాఖ్యానించారు. మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్లాకుట్టి ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలంరేపాయి. దీనిపై కేరళ పీసీసీ ఆయన వివరణ కోరుతూ షోకాజు నోటీసు జారీ చేసింది. ఆయన వివరణతో సంతృప్తి చెందని పీసీసీ, పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.