10 నెలల కొడుకుకు విషమిచ్చి యువతి ఆత్మహత్య.. ఇద్దరి మరణం తట్టులేక తల్లి ఆత్మహత్యాయత్నం!
హైదరాబాద్ మహానగరంలో కుటుంబ కలహాలతో ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిశాయి. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తన పది నెలల కొడుకుకు విషం ఇచ్చి చంపి, తాను ఫ్యాుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు, మనువడి మరణాన్ని చూసి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

హైదరాబాద్ మహానగరంలో కుటుంబ కలహాలతో ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిశాయి. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తన పది నెలల కొడుకుకు విషం ఇచ్చి చంపి, తాను ఫ్యాుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు, మనువడి మరణాన్ని చూసి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టింది.
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న సుష్మ (27)కు నాలుగు సంవత్సరాల క్రితం చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న యశ్వంత్ రెడ్డితో వివాహమైంది. వీరికి యశ్వవర్ధన్ రెడ్డి (10 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలతో గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పార్థలు వచ్చినట్లు తెలుస్తంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే సుష్మ తల్లి లలిత (44) ఫంక్షన్ షాపింగ్ కోసం ఇటీవల కూతురు ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో మానసిక ఒత్తిడిలో ఉన్న సుష్మ గురువారం (జనవరి 8) తల్లి ఇంట్లో ఉండగానే బెడ్రూమ్లోకి వెళ్లి, తన కుమారుడికి విషమిచ్చి చంపింది. ఆ తర్వాత తాను ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో కూతురు, మనువడిని విగతజీవులుగా చూసి తట్టుకోలేకపోయిన సుష్మ తల్లి లలిత సైతం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రాత్రి సుమారు 9:30 గంటలకు ఇంటికి వచ్చిన యశ్వంత్ రెడ్డి తలుపులు మూసి ఉండటంతో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే భార్య, కొడుకు విగతజీవులుగా కనిపించారు. అత్త లలిత చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాణపాయ స్థితిలో ఉన్న లలితను ఆసుపత్రికి తరలించారు. సుష్మ, బాలుడి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుష్మ ఆత్మహత్యకు కుటుంబ కలహాలేనా మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
