Hyderabad Water Supply Alert: నగరవాసులకు అలర్ట్.. హైదరాబాద్‏లో నీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే..

నగరవాసులకు అలర్ట్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఇవాళ నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. మంజీరా వాటర్ సప్లై ఫేజ్

Hyderabad Water Supply Alert: నగరవాసులకు అలర్ట్.. హైదరాబాద్‏లో నీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే..
Hyderabad Water Supply
Follow us

|

Updated on: May 25, 2021 | 8:30 AM

నగరవాసులకు అలర్ట్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఇవాళ నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. మంజీరా వాటర్ సప్లై ఫేజ్- II, 1500 ఎంఎం డయా పిఎస్సి పైప్‌లైన్‌ను మార్చడానికి జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పటాన్ చెరు నుంచి హైదర్‌నగర్ వరకు గల పంపింగ్ మెయిన్, ఎంఎస్ పైప్ లైన్‌ మదీనాగూడ వద్ద వరద నీటి కాలువ, ఇతర లీకేజీ పనుల నిర్మాణ పనులను చేస్తున్నారు అధికారులు. దీంతో మే 27 గురువారం ఉదయం 6 గంటల నుంచి మే 28 శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నిర్మాణ పనులు జరగనున్నాయి. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. నగరవాసులు ఈ రెండు రోజులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలు..

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: 1. ఓ అండ్ ఎం డివిజన్ నం 15 – గంగారాం, దీప్తీశ్రీ నగర్, కెఎస్ఆర్ ఎన్ క్లేవ్, అపర్ణ హిల్స్, ఆదర్శ్ నగర్, శాంతి నగర్, మియాపూర్, మైత్రినగర్, మదీనాగూడ, ఉషోదయ నగర్, వైశాలి నగర్, రామకృష్ణ నగర్, సాయిరాం కాలనీ, మియాపూర్ క్రాస్ రోడ్స్, మాతృ శ్రీ నగర్, రాజారాం కాలనీ, అంబేద్కర్ నగర్, జనప్రియ ఫేజ్ 1 & 2, మియాపూర్ విలేజ్, మాధవ్ నగర్, భాను టౌన్ షిప్, నంది కోఆపరేటివ్ సొసైటీ, హుడా మయూరి నగర్, ఎస్సీ బోస్ నగర్, సిర్లా గార్డెన్స్, ఆర్బిఆర్ బాలాజీ నగర్, ఆదిత్య నగర్, శ్రీరంగపురం. 2. ఓ అండ్ ఎం డివిజన్ నం 9 – హైదర్ నగర్, అడ్డగుట్ట,నిజాంపేట్ మెయిన్ రోడ్, కెపిహెచ్‌బి కాలనీలోని వసంత్ నగర్, రామ్ నరేష్ నగర్. 3. ఓ అండ్ ఎం డివిజన్ నం 32 – బొల్లారం మున్సిపాలిటీ, ఐలాపుర్ గ్రామం, గండి గూడెం, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డి పేట్, పటేల్‌ గూడ గ్రామం. 4. ఓ అండ్ ఎం డివిజన్ నం 6 పరిధిలో ఎస్.అర్. నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో లో ప్రెజర్ నీరు వస్తుంది.

Also Read: మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?

ఆర్ యూ వర్జిన్ ? అంటూ ప్రశ్నించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు..