AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajender to join BJP: బీజేపీలోకి ఈటల రాజేందర్..? ఫాంహౌజ్ వేదికగా ప్రయత్నాలు.. కొలిక్కి వస్తున్న మంతనాలు..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ మంత్రి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా? ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లేనా? అంటే అవుననే సమాధానమే వస్తుంది.

Etela Rajender to join BJP: బీజేపీలోకి ఈటల రాజేందర్..?  ఫాంహౌజ్ వేదికగా ప్రయత్నాలు.. కొలిక్కి వస్తున్న మంతనాలు..!
Etela Rajender Likely To Join Bjp
Balaraju Goud
|

Updated on: May 25, 2021 | 8:28 AM

Share

Etela Rajender likely to join BJP: మాజీ మంత్రి ఈటల రాజేందర్​ మంత్రి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా? ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లేనా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కేంద్రానికి చెందిన ఓ దూత అత్యవసరంగా ప్రత్యేక విమానంలో హడావిడిగా హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్​పై భారీ అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా సీఎం కేసీఆర్​కు.. మంత్రి ఈటల రాజేందర్​కు బేదాభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాదు సీఎం కేసీఆర్ నిర్ణయాలపై సమయం దొరికనప్పుడల్లా బహిరంగానే విమర్శలు సైతం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో మెదక్​ జిల్లాలో దాదాపు 20 ఎకరాల అసైన్డ్​ భూమిని ఈటల రాజేందర్ కబ్జా చేసిన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. అయితే, గత కొంతకాలంగా తన కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడతారన్న ప్రచారం సాగుతోంది. కాగా, తాజా పరిణామాలను చూస్తుంటే ఆయన బీజేపీలో చేరనున్నారని వార్తలు అందుతున్నాయి.

ఇదే క్రమంలో మొయినాబాద్‌లోని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన ఫాంహౌస్‌లో బీజేపీ నేతల రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ఢిల్లీ దూత బీజేపీపీ జాతీయ నాయకుడు భూపేందర్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా హాజరైనట్లు సమాచారం. ఈ భేటీలో బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ సహా పలువురు బీజేపీ పార్టీ రాష్ట్రస్థాయి అగ్ర నాయకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్‌పై అత్యంత జాగరూకత వహించినట్లు సమాచారం.

ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కొందరు ముఖ్యనాయకులు గతంలోనే బహిరంగంగా ఈటెలకు అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఈటలను తమ పార్టీలో చేర్చుకోవాలని కూడా భావించింది కాంగ్రెస్. అయితే, ఇందుకు సరియైన పొంతనలు కుదురక ఈటల దాటవేసినట్లు సమాచారం. అయితే, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎన్నికలు వస్తే కచ్చితంగా అది టీఆర్ఎస్ – ఈటెల మధ్య పోటీ ఉండబోతున్నట్లు స్థానిక ప్రజల అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో అభ్యర్థిని నిలిపిన ఓటమి తప్పదనే భావనలో ఉన్నారు. దీంతో కొంత కాలం ఈటలకు మద్దతు ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినట్లు సమాచారం.

ఇక, ఈట‌ల ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోన‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో పాటు బీజేపీ ఎంపీ ధ‌ర్మపురి అర‌వింద్‌తోసైతం ఈట‌ల భేటీ అయ్యారు. ఈ భేటీలో ప‌లు విష‌యాల‌పై వారి మ‌ధ్య చ‌ర్చకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పార్టీలో మంచిస్థానాన్ని క‌ల్పిస్తానంటే బీజేపీలోకి వ‌చ్చేందుకు తాను సిద్ధమేన‌ని ఈట‌ల సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అర‌వింద్ ఈ విష‌యాన్ని రాష్ట్ర, కేంద్ర పార్టీ పెద్దల‌కు వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో ఈట‌ల‌ను బీజేపీలోకి ఆహ్వానించ‌డం ద్వారా పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని, కేసీఆర్‌పై పోరాటంలో కొంత‌మేర విజ‌యం సాధించిన‌ట్లవుతుంద‌ని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానం పెద్దల వ‌ద్ద ప్రస్తావించిన‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల‌కు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా క్యాడ‌ర్ ఉంది. ఈట‌ల‌ను బీజేపీలోకి ఆహ్వానించ‌డం ద్వారా వీరితో పాటు తెలంగాణ ఉద్యమ‌కారులు, కేసీఆర్ వ్యతిరేక వ‌ర్గీయులు, బీసీ వ‌ర్గాల వారు మ‌న పార్టీకి అండ‌గా నిలిచే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకనుగుణంగానే ఆయన తన రాజకీయ భవిష్యత్​ను నిర్మించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలా రోజులుగా ఆయన బీజేపీ అగ్రనేతలతో టచ్​లో ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవి పోయిన అనంతరం కొంతకాలానికే ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈటల రాజేందర్​ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. టీఆర్​ఎస్​ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కేసీఆర్​కు అండగా నిలబడుతూ వస్తున్నారు. మరోవైపు బలమైన బీసీ నేతగా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్​ జిల్లా హుజుర్​నగర్​ నుంచి ఆయన ప్రాతినిథ్యం వహించారు.

ఇదిలావుంటే, మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడని టీఆర్‌ఎస్‌ అంచనా వేసింది. ఆ పార్టీ క్యాడర్‌ ఆయన్ని అలాగే రెచ్చగొట్టింది. ఆయన్ని సమర్థించే అనుచరులు సైతం ఇదే విషయమై ఈటలపై ఒత్తిడి తెచ్చారు. కొత్త పార్టీ పెట్టబోతున్నాడని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టడానికి కూడా ఆయన పావులు కదిపారు. ఈటల తన నియోజకవర్గానికి వెళ్లినప్పుడల్లా పరోక్షంగా పార్టీ అధినేతను, ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ వచ్చారు.

ప్రస్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజ‌య్ అధ్యక్షత‌న ప‌నిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈట‌లను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయ‌త్నాలు బాగానే చేస్తున్నట్లు ఆ పార్టీ నేత‌ల్లో చ‌ర్చసాగుతుంది.

Read Also…  Telangana Vaccination : తెలంగాణలో నేటి నుంచి వ్యాక్సినేషన్ షురూ.. వారికే తొలి ప్రాధాన్యత..!

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..