తెలంగాణ పోలీస్ అకాడమీలో వందల చెట్ల నరికివేత.. షాకింగ్ రీజన్
తెలంగాణా పోలీస్ అకాడమీ కొత్త వివాదంలో చిక్కుకుంది. హరితహారంలో భాగంగా కొత్త మొక్కలు నాటేందుకు ఉన్న చెట్లను అధికారులు కొట్టేశారు.

తెలంగాణా పోలీస్ అకాడమీ కొత్త వివాదంలో చిక్కుకుంది. హరితహారంలో భాగంగా కొత్త మొక్కలు నాటేందుకు ఉన్న చెట్లను అధికారులు కొట్టేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా వందల చెట్లను అడ్డంగా నరికివేశారు. దీంతో వివాదం మొదలైంది. ఉన్న చెట్లు నరికేసి, కొత్త చెట్లు నాటడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ స్థలంలో మామిడి పండ్ల మొక్కలను పెంచి అకాడమీ ఆదాయాన్ని పెంచాలని ఉన్నతాధికారి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చెట్లను నరికివేసినట్లు సమాచారం. ఇక కొత్తగా నాటిన చెట్ల సంరక్షణ బాధ్యతలను క్యాడెట్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే హరితహారం అంటే కొత్త చెట్లను నాటడమని.. అంతేగానీ ఉన్న చెట్లను నరికి, కొత్త చెట్లను నాటడం కాదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.



