స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ సీఎం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్ హొం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆయన మూడు రోజుల పాటు హోం క్వారంటైన్ లోకి వెళ్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే ముఖ్యమంత్రి, మంత్రుల సైతం కొవిడ్ బారినపడుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్ హొం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆయన మూడు రోజుల పాటు హోం క్వారంటైన్ లోకి వెళ్తున్నట్టు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. గత రెండ్రోజుల క్రితం మనాలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అయితే, సందర్భంగా ఆయనతో కలిసిన కొందరికి కరోనా పాజిటివ్ సోకిన్నట్టు తేలడంతో సీఎం క్వారంటైన్లోకి వెళ్లారని ఆయన తెలిపారు. క్వారంటైన్ సమయంలో సీఎం తన ఇంటివద్ద నుంచే విధులు నిర్వహించనున్నారు. కాగా, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.