తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, తగ్గిన ఆర్- వాల్యూ
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం 2,00,611 కు చేరింది. మరోవైపు ఆర్ వాల్యూ మాత్రం క్రమంగా తగ్గుతుంది.
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం 2,00,611 కు చేరింది. మరోవైపు ఆర్- వాల్యూ మాత్రం క్రమంగా తగ్గుతుంది. కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి సగటున ఎంతమంది ఇతర వ్యక్తులకు వైరస్ సంక్రమించిందన్న వి యాన్ని ఆర్- వాల్యూ (రీ ప్రొడక్షన్) తెలియజేస్తుంది. దీని ద్వారా వైరస్ వ్యాప్తి తీవ్రతపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో ఆర్- వాల్యూ ఆగస్టు మూడవ వారంలో 1.27 ఉండగా, అది సెప్టెంబర్ మూడవ వారంలో కేవలం 1 కి పడిపోయింది. ఈ సంఖ్య భారత సగటు 0.86 కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, నిపుణులు రాష్ట్రంలో సంక్రమణ వ్యాప్తి భయంకరమైన దశలో లేదని, క్రమంగా తగ్గుతున్నదని చెప్పారు. నిజానికి ఆర్- వాల్యూ ఒకటి కంటే తక్కువగా ఉండటం ప్రజల ఇమ్యూనిటి పవర్ మెరుగు పడుతుందనడానికి సంకేతం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19 సోకిన వ్యక్తి సగటున ఒకరి కంటే తక్కువగానే వ్యాధి వ్యాప్తి చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Also Read :
హైదరాబాద్‌లో బైక్ నంబర్ ప్లేట్లకు మాస్కులు, పోలీసులకు కొత్త చిక్కులు