జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన ఆప్షన్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరోసారి ఈనెల 12వ తేదీన భేటీ కావాలని నిర్ణయించారు. లోటును పూడ్చుకోవడానికి అప్పులు చేసుకోవచ్చన్న కేంద్రం ప్రతిపాదనకు విపక్ష పాలిత రాష్ట్రాలు ససేమిరా
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన ఆప్షన్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరోసారి ఈనెల 12వ తేదీన భేటీ కావాలని నిర్ణయించారు. లోటును పూడ్చుకోవడానికి అప్పులు చేసుకోవచ్చన్న కేంద్రం ప్రతిపాదనకు విపక్ష పాలిత రాష్ట్రాలు ససేమిరా అన్నాయి.
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన 20 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లిస్తునట్టు తెలిపారు . 42వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో జరిగిన నిర్ణయాలను నిర్మలా వెల్లడించారు. ఈ రాత్రికే 20 వేల కోట్లను విడుదల చేస్తామని తెలిపారు.
ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను వారం రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు నిర్మలా సీతారామన్ . గతంలో ఐజీఎస్టీ బకాయిలు తక్కువగా పొందిన రాష్ట్రాలకు వారం రోజుల్లో 24 వేల కోట్లు చెల్లిస్తామని తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాలు తమకు రావాల్సిన ఐజీఎస్టీ వాటా కంటే ఎక్కువగా పొందాయని , వాటిని వెంటనే చెల్లించాలని ఆయా రాష్ట్రాలను కోరుతున్నట్టు తెలిపారు.
తెలంగాణ, పశ్చిమబెంగాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మొత్తం 10 ఆప్షన్లకు అంగీకరించలేదు. జీఎస్టీ పరిహారాన్ని వెంటనే కేంద్రమే చెల్లించాలని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. ఈనెల 12వ తేదీన మరోసారి భేటీ కావాలని కౌన్సిల్ నిర్ణయించింది.