ప్రపంచవ్యాప్తంగా పది మందిలో ఒకరికి కరోనాః డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా సుమారు పది మందిలో ఒకరు కరోనా బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరెంతో మంది కరోనా సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా పది మందిలో ఒకరికి కరోనాః డబ్ల్యూహెచ్‌ఓ
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 05, 2020 | 9:46 PM

ప్రపంచవ్యాప్తంగా సుమారు పది మందిలో ఒకరు కరోనా బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరెంతో మంది కరోనా సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపింది. తమ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో పది శాతం మందికి కరోనా వైరస్‌ సోకి ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ సోమవారం వెల్లడించింది. అయితే, అయా దేశాలు, ప్రాంతాలపరంగా ఇందులో వ్యత్యాసం ఉన్నాయని వివరించింది. మొత్తం మీద ప్రపంచంలోని మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉన్నదని మరోసారి డబ్ల్యూహెచ్‌ఓహెచ్చరించింది.

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నదని, రాబోయే రోజుల్లో మరింత కష్టకాలన్ని ఎదుర్కోనున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఆ సంస్థ టాప్‌ ఎమర్జెన్సీ ఎక్స్‌పర్ట్‌ మైక్ ర్యాన్ ఈ మేరకు వెల్లడించారు. ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యధరా ప్రాంతంలో కరోనా కేసుల తీవ్రత, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. మరోవైపు, కరోనా వ్యాప్తికి మూలమైన చైనాలో దర్యాప్తు కోసం అంతర్జాతీయ మిషన్‌లో పాల్గొనే నిఫుణుల జాబితాను ఆ దేశ ఆమోదం కోసం డ్లబ్యూహెచ్‌ఓ పంపినట్లు మైక్ ర్యాన్ వెల్లడించారు.