IPL 2020 Match 19: RCB vs DC : ఢిల్లీ సూపర్ స్కోరు, బెంగళూరు టార్గెట్ 197

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం దుబాయ్‌లో జ‌రుగుతున్న టోర్నీ 19వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 196 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

IPL 2020 Match 19: RCB vs DC : ఢిల్లీ సూపర్ స్కోరు, బెంగళూరు టార్గెట్ 197
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 05, 2020 | 9:45 PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం దుబాయ్‌లో జ‌రుగుతున్న టోర్నీ 19వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 196 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ  ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ఆ జ‌ట్టు 196 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో మార్క‌స్ స్టాయినిస్ 53 (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)  ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే పృథ్వీ షా 42  (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌లు) ప‌రుగులు చేశాడు. రిష‌బ్ పంత్ 37 ( 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ప‌రుగులు, శిఖ‌ర్ ధావ‌న్ 32 ( 28 బంతుల్లో 3 ఫోర్లు) సమిష్ఠిగా రాణించారు . దీంతో ఢిల్లీ భారీ స్కోరు చేయ‌గలిగింది. ఇక బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ 2 వికెట్లు తీయ‌గా, మొయిన్ అలీ, ఉదానాలు చెరొక వికెట్ దక్కించుకున్నారు.