హైదరాబాద్‌లో బైక్ నంబర్ ప్లేట్లకు మాస్కులు, పోలీసులకు కొత్త చిక్కులు

కోవిడ్ -19 కు దూరంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడడానికి అధికారులు కష్టపడుతున్న సమయంలో, హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పోలీసులు కొత్త చిక్కులు ఎదుర్కుంటున్నారు.

హైదరాబాద్‌లో బైక్ నంబర్ ప్లేట్లకు మాస్కులు, పోలీసులకు కొత్త చిక్కులు
Follow us

|

Updated on: Oct 05, 2020 | 9:14 PM

కోవిడ్ -19 కు దూరంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడడానికి అధికారులు కష్టపడుతున్న సమయంలో, హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పోలీసులు కొత్త చిక్కులు ఎదుర్కుంటున్నారు. ఈ-చలాన్ల నుంచి తప్పించుకోడానికి  బైకర్లు తమ నంబర్ ప్లేట్‌లను ఫేస్ మాస్క్‌లు వేసి తిరుగుతున్నారు.

“ఈ వారం మెహదీపట్నం, ఆసిఫ్ నగర్ క్రాస్రోడ్ వద్ద నంబర్ ప్లేట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతూ 12 మంది పట్టుబడ్డారు. చాలామంది రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఫేస్ మాస్క్‌తో దాచారు” అని హైదరాబాద్ సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. 12 మందిపై ఐపీసీ 420, 511 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 

గతంలో చైన్ స్నాచింగ్, కారు దొంగతనాలకు పాల్పడే నేరస్థులు సీసీటీవి ఫుటేజీల నుండి వారి ఐడిని కవర్ చేయడానికి నంబర్ ఫ్లేట్లను వంచడం లేదా మార్చడం చేసేవారు.  అయితే ఇప్పుడు సాధారణ వాహనదారులు సైతం ఈ-చలాన్ల నుండి దూరంగా ఉండటానికి నంబరు ప్లేట్లను తారుమారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలా చేసేవారికి కఠినమైన శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరికొందరు వారి నంబర్ ప్లేట్ల నుంచి అంకెలను తారుమారు చేయడం, మార్చడం వంటివి చేస్తున్నారని పోలీసులు వివరించారు. అటువంటి వారిపై అదనంగా ఫోర్జరీ కేసులు బుక్ చేస్తామని  తెలిపారు.  ( రైతులకు అలెర్ట్ : పీఎం కిసాన్ స్కీమ్ డబ్బు పడకపోతే ఇలా చేయండి ! )

లైసెన్స్ ప్లేట్ మార్ఫింగ్ పోలీసులకు కొత్త తలనొప్పిగా మారింది. చాలా మంది  నంబర్ ప్లేట్‌లో అంకెలు లేదా వర్ణమాలలను ట్యాంపర్ చేయడంతో, ఏ తప్పూ చేయని వినియోగదారులకు ఈ-చలాన్లు వెళ్తున్నాయి. ఈ అంశంపై ప్రతి వారం పోలీసులకు వాహనదారుల నుంచి కనీసం 15 ఫిర్యాదులు వస్తున్నాయట. ( నాయినికి కరోనా నెగిటివ్