దివి నుంచి భువికి దిగొచ్చిన వన దేవతలా ఆలియా..

May 07, 2024

TV9 Telugu

TV9 Telugu

గ్లోబల్ ఫ్యాషన్‌ షో మెట్‌ గాలాలో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ మెరిసిపోయింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ ప్రోగ్రాం జరిగింది

TV9 Telugu

గతేడాది మెట్‌ గాలాలో తొలిసారి మెరిసింది ఈ బ్యూటీ.. ఈసారీ గ్రీన్‌ కార్పెట్‌పై తనదైన రీతిలో హొయలు ఒలకబోసింది. గ్లోబల్‌ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో దర్శనమిచ్చింది

TV9 Telugu

ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన మింట్‌ గ్రీన్‌ కలర్‌ షీర్‌ శారీని ఆలియా ధరించిం తళుక్కున మెరిసింది.  చీరకు జతగా వెనుక భాగంలో 23 అడుగుల పొడవైన వెయిల్‌తో చూపరులను కట్టిపడేసింది

TV9 Telugu

ఈ చీరకు చాలా ప్రత్యేకత ఉంది.163 మంది కళాకారులు, 1905 పనిగంటలు వెచ్చించి మరీ దీనిని  రూపొందించారట. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్‌కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీని తయారు చేశారు

TV9 Telugu

ఈ చీరపై విభిన్న రంగుల్లో ఫ్లోరల్‌ ఎంబ్రాయిడరీతో పాటు బీడ్స్‌, సీక్విన్స్‌, స్టోన్స్‌, గ్లాస్‌ బీడ్స్‌, ముత్యాలు.. వంటి వాటితో హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి మ్యాచింగ్‌గా అదే కలర్‌ షీర్‌ బ్లౌజ్‌ ప్రత్యేక అందాన్ని తెచ్చింది

TV9 Telugu

వెనుక వైపు బౌ డిజైన్‌తో తన రవికెకు అదనపు హంగులద్దింది. బన్‌ హెయిర్‌స్టైల్‌, మాతా పట్టితో.. ఎప్పటిలాగే తక్కువ మేకప్‌తో మెట్‌ గాలా వేదికపై తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌ని ప్రదర్శించింది ఆలియా

TV9 Telugu

దీంతో అలియా రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై తిరిగాయి. చూపు తిప్పుకోనివ్వని అందంతో ఇండియన్‌ ప్రిన్సెస్‌లా గ్రీన్‌ కార్పెట్‌పై వెలిగిపోయింది

TV9 Telugu

మెట్ గాలా ఈవెంట్‌లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం